Vijay Mallya : విజయ్ మాల్యాపై సీబీఐ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్..

Vijay Mallya

Vijay Mallya

Vijay Mallya : ఎనిమిదేళ్ల క్రితం దేశం విడిచి వెళ్లిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గత వారం ఓపెన్ ఎండ్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి పొందిన రుణాన్ని అనుకున్న నికి ఉపయోగించకుండా మరో చోటికి బదిలీ చేశారని, రుణం ఎగ్గొట్టారని మాల్యాపై ఆరోపణలు వచ్చాయి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్న కేసులో విజయ్ మాల్యాపై ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 68 ఏళ్ల విజయ్ మాల్యాపై గతంలో వివిధ కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని సీబీఐ కోర్టు ఓపెన్ఎండ్ వారెంట్ జారీ చేసింది. అంటే ఇది గడువులేని వారెంట్. ఇది మరింత తీవ్రమైన వారెంట్ అవుతుంది.

2016లోనే భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన మాల్యా ప్రస్తుతం లండన్ లో నివాసం ఉంటున్నారు. పరారీలో ఉన్న ఆయనను తమకు అప్పగించాలని భారత్ చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.

TAGS