Ex CM Jagan : ప్రజలకు పనికి రాకుండా రూ. 5 వేల కోట్లు ఖర్చు.. నేటి వరకు బయటపడ్డ మాజీ సీఎం జల్సాల లీలలు..
Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు గురించి ఎంత చెప్పినా తక్కవే. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆయన ఒక సారి జైలు జీవితం కూడా గడిపాడు. ఇక ఆ తర్వాత ఏపీకి సీఎం కావడంతో మళ్లీ ప్రారంభించాడు. ఆయన గురించి ఒక్కో విషయం బయటకు వస్తూనే ఉంది. ఇది అదీ అని తేడా లేకుండా ప్రతీ దానిలో అక్రమాలు, అవినీతి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తన జల్సాల కోసం వాడుకున్నాడు. ఎవడబ్బ సొత్తని అన్ని వేల కోట్లను విచ్చల విడిగా ఖర్చు చేశారని ప్రజలు మండిపడుతున్నారు.
తన భార్య కోసం రుషికొండ ప్యాలెస్ ను రూ. 500 కోట్లు వెచ్చించి మరీ నిర్మించారు. ఇప్పుడు ప్రశ్నిస్తే జగన్ అనుచరులు అది రాష్ట్రపతి, ప్రధాని లాంటి ప్రముఖుల కోసం నిర్మించారని సన్నాయి నొక్కలు నొక్కుతున్నారు. అసెంబ్లీ ఎలాంటి మాట చెప్పకుండా రూ. 500 కోట్లను ఎలా వెచ్చించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే కాకుండా తన భార్య కీ రోల్ పోషిస్తున్న సాక్షికి రూ. 144 కోట్లు అప్పనంగా ఇచ్చాడు. డిజిటల్ కార్పొరేషన్ కింద వైసీపీ జీతాలు అంటూ రూ. 2000 కోట్లు తిన్నారు. 26 జిల్లాల్లో తన క్యాపు కార్యాలయాలు కట్టుకునేందుకు 26 ప్యాలెస్ లకు రూ. 900 కోట్లు వినియోగించాడు. తన సెక్యురిటీగా పని చేసిన 986 మందికి వేతనాలు, మెయింటెనెన్స్ కోసం రూ. 1000 కోట్లు వాడారు. లండన్ లో ఉన్న తన పిల్లల కోసం సెక్యురిటీగా రూ. 60 కోట్లు దాచాడు. ఇక తాడేపల్లి ప్యాలెస్ లో ఫర్నీచర్, కిటికీలు, మరుగుదొడ్ల తదితరాల కోసం ఏకంగా రూ. 80 కోట్లు వాడారు.
ఇదంతా ప్రభుత్వ సొమ్మే. ఇంత సొమ్ము అప్పనంగా వాడడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంత లేదన్నా దాదాపు 5 వేల కోట్ల వరకు అవుతుంది. ప్రజలకు ఏ మాత్రం అక్కరకు రాని వాటి గురించి ఇంత సొమ్మును జగన్ వాడారు. ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు కానీ.. మరో సారి ప్రభుత్వంలో ఉండి ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు గంపగుత్తగా అమ్మేవాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.