Kalki Occupancy : కల్కికి అక్కడి ఆక్యుపెన్సీ తెలిస్తే షాకే..
Kalki Occupancy : బహుభాషా చిత్రంగా తెరకెక్కిన కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27న థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదైంది. ప్రపంచ వ్యాప్తంగా 8500 స్క్రీన్లలో కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని సెంటర్ల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని తెరపైన ఆవిష్కరించాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రభాస్ కల్కి సినిమాకి ఉత్తరాదితో పాటు ఓవర్సీస్ లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇక తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమా టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రభాస్ దుమ్ము రేపుతున్నాడు. ప్రభాస్ కి తెలుగునాట ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఇంతకు ముందు ఉత్తర భారతంలో సెంట్రల్ స్టేట్స్ తో పాటు సిటీల్లో మాత్రమే తెలుగు సినిమా పరిమితం అయ్యేది. అయితే ఇప్పుడు రాజస్థాన్ లాంటి లోని చిన్న చిన్న పట్టణాలకు కల్కి మూవీ రీచ్ అయ్యింది.
రాజస్థాన్ లో టోంక్ టౌన్ లో డబ్బింగ్ సినిమాలకి 20 శాతం ఆక్యుపెన్సీ వస్తేనే గొప్పగా భావిస్తుంటారు. ఇక కల్కి 2898ఏడీ చిత్రానికి ఏకంగా 77% ఆక్యుపెన్సీ వచ్చినట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు వెల్లడించారు. దీనిని బట్టి కల్కి మూవీ ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కల్కి 2898ఏడీ సినిమా ప్రమోషన్స్ మాత్రం తక్కువనే చెప్పాలి.
అయితే ప్రభాస్ స్టార్ డమ్, కల్కి మూవీ కంటెంట్ పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి.. ఆక్యుపెన్సీ పెరగడానికి కారణమని తెలుస్తోంది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ మూవీని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు పేర్కంటున్నారు. ప్రేక్షకులని ఆకట్టుుకునే అంశాలు మూవీలో ఉండడంతో ఈ స్థాయిలో ఆదరణ వస్తున్నదని చెబుతున్నారు.
మల్టీప్లెక్స్ లలో కూడా ఆడియన్స్ నుంచి విజిల్స్ పడడం కల్కి చిత్రానికే కనిపించిందంటున్నారు. కచ్చితంగా ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అత్యధిక కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో శని, ఆదివారాల్లో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా ఇంకా ఏయే రికార్డులను బద్దలు చేస్తుందో చూడాలి.