C-Next Survey : తెలంగాణలో ఆ పార్టీదేనా అధికారం?
C-Next Survey : తెలంగాణలో ఆసక్తికర ఫలితాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ కు ఓటర్లు ఈసారి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. దీంతో పదేళ్ల పాలనకు చరమగీతం పాడతారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సీ నెక్ట్స్ సర్వే నిర్వహించిన సర్వేలో అందుకు తగిన ఫలితాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 91 సీట్లు రాబోతున్నాయని తేల్చింది. గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ బలపడటం విచిత్రంగానే ఉంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో అంత మెరుగ్గా లేకున్నా కర్ణాటక ఫలితాలతోనే ఇక్కడ కలిసొచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు 14 సీట్లు రాబోతున్నాయని చెబుతున్నారు. సీ నెక్ట్స్ నిర్వహించిన సర్వేలో పలు విషయాలు తెలుస్తున్నాయి.
బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకు 4 సీట్లు వస్తాయని తేల్చింది. బీజేపీ 5 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్పీ సిర్పూర్ లో విజయకేతనం ఎగరవేస్తారని తేలింది. బీజేపీ గెలిచే ఐదు సీట్లలో కరీంనగర్, సిరిసిల్ల, నర్సాపూర్, చేవెళ్ల, మలక్ పేట ఉండనున్నాయి. దీంతో కాంగ్రెస్ జాతకమే మారనుందని అంచనా వేస్తోంది.
సీఎం కేసీఆర్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవుతున్నట్లు తేల్చింది. గజ్వేల్ లో ఈటల రాజేందర్ చేతిలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి చేతిలోనూ ఓడిపోతున్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరు రెండు చోట్ల విజయం సాధిస్తారని వెల్లడించింది. సిర్పూర్ లో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గెలుస్తారని తెలుస్తోంది.
సర్వేరిపోర్టును కింద పీడీఎఫ్ లో చూడొచ్చు