Telangana : తెలంగాణలో రవాణాశాఖ అధికారుల పెన్ డౌన్

Telangana

Telangana

Telangana : తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు శుక్రవారం పెన్ డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్ పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు. గురువారం హైదరాబాద్ జేటీసీపై ఆటో యూనియన్ నేత ఒకరు దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రవాణాశాఖ కమిషనర్ తో చర్చల అనంతరం పెన్ డౌన్ ఆలోచనను విరమించుకొని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ రమేశ్ చాంబర్ లోకి చొరబడి ఆయనపై భౌతిక దాడి చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. గాయపడిన రమేశ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. జేటీసీపై దాడిని రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. జేటీసీపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ ఉద్యోగులు పెన్ డౌన్ కు పిలుపునిచ్చారు.

TAGS