Zero FIR : జీరో ఎఫ్ఐఆర్.. ఆన్ లైన్ లో ఫిర్యాదులు

Zero FIR

Zero FIR

Zero FIR : వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలతో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది.

ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గత ఏడాది భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇవి బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్ పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రానున్నాయి.

TAGS