Jagan : ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ జగన్ కు హైకోర్టు నోటీసులు

 Jagan

Jagan

Jagan : పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోచమ్మ కొట్టిందట. అధికారం ఉంది కదా అని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన ఆంధ్రప్రదేశ్ జగన్ కు పాపాల సెగ తగిలింది. బాబుతో జైలు జీవితం గడిపించిన జగన్ మెడకు ఇప్పుడు అవినీతి కేసు చుట్టుకుంటోంది. ఎంపీ రఘురామ క్రిష్ణ రాజు వేసిన పిటిషన్ తో హైకోర్టు జగన్ తోపాటు 41 మందికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.

అనంతరం విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున అవినీతి రాజ్యమేలుతుందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఖజానాను ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏపీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

ప్రజాప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టుకు విన్నవించినా కోర్టు మాత్రం వారికి నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగించింది. చంద్రబాబుపై కుట్రపూరితంగా పెట్టిన కేసులకు ఇప్పుడు బదులు తీర్చుకున్నట్లు అయింది. పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇరువైపుల వాదనలు విన్న కోర్టు 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. దీంతో జగన్ లో భయం మొదలైంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతి ప్రధానంగా చోటుచేసుకుందని ఆరోపణలు రావడంతో ఇప్పుడు మొత్తం పథకాలపై విచారణ కొనసాగనుంది. డిసెంబర్ 14 తరువాత ఏం జరగబోందనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

TAGS