YCP – Congress : చేతులెత్తేసిన జగన్.. కాంగ్రెస్ లో వైఎస్సార్ సీపీ విలీనం.. బెంగళూరు వేదికగా చర్చలు?

YCP - Congress

YCP – Congress

YCP – Congress : వైసీపీ  మీద, జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్.. ఈ విషయమై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చించినట్లు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచిందన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నియంత పాలనను అందించినందునే జనం తిరస్కరించారని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అపూర్వ  విజయాన్ని అందించారని అన్నారు. ఘోర ఓటమితో ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఉన్నారని.. అందుకే బెంగళూరులో డీకే శివకుమార్‌తో చర్చించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్లారన్నది ఏపీలో చర్చనీయాంశం అయింది.  టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో  చంద్రబాబు మోడీల కూటమి తనను టార్గెట్ చేస్తుందని భావిస్తున్న వైఎస్ జగన్ ఆసక్తికర రాజకీయానికి తెరలేపారని చర్చ జరుగుతుంది. అందువల్లే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆయన చెబుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికోసమే బెంగళూరు వేదికగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది.

 కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని ప్రచారం అవుతుంది. అయితే డీకే శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

TAGS