Indian Rich People : విదేశాల్లో స్థిరపడుతున్న మనదేశ సంపన్నులు
Indian Rich People : మన దేశంలో చాలా మంది విదేశాల బాట పడుతున్నారు. 3.7 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నారు. వారిలో 1.34 కోట్ల మంది ప్రవాస భారతీయులుగా (ఎన్ఆర్ఐ) ఉంటున్నారు. 1.86 కోట్ల మంది భారత సంతతికి చెందిన వారు ఇతర దేశాల్లో పౌరులుగా ఉన్నారు. ఏటా 25 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
2022అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు 96 వేల మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించి అరెస్టయినట్లు వార్తలు వచ్చాయి. భారతీయులు పర్యాటక వీసాలపై వెళ్లి అక్కడే స్థిరపడే వారు చాలా మంది ఉన్నారు. ఏటా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఉన్నత చదువులు చదువుకునేందుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు.
అక్కడ మంచి అవకాశాలు ఉండటంతో అక్కడే ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన టోఫెల్, జీఆర్ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో హైదరాబాద్, గుంటూరుకు చెందిన వారే 12 శాతం భారతీయులుంటున్నారు. 2021లో వీరు 7.5 శాతమే అయినా 2022లో విదేశాలకు వెళ్లే భారతీయుల్లో సగం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం.
ఇతర దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు ఆకర్షించడంతో చాలా మంది విదేశాల్లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ వల్ల 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. 2013-22 మధ్య మొత్తం 48,500 మంది సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోయారు. 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత్ నుంచి ఏటీ వేలాది మంది వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడుతున్నారు.