Nag Ashwin : నాగ్ అశ్విన్ కల్కి ప్రమోషన్లలో వెనకబడ్డాడా.. రాజమౌళికి, నాగ్ అశ్విన్ కు మధ్య తేడా అదే..

Nag Ashwin

Nag Ashwin

Nag Ashwin : కల్కి సినిమా మొత్తం డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన భుజాలపై మోస్తున్నాడు. అయితే రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల సమయంలో చేసిన పని నాగ్ అశ్విన్ చేయలేకపోతున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి స్టార్ హిరోలతో ఒక సినిమా అనుకున్నాడంటే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే దాని ప్రమోషన్ మొదలెట్టినట్లు. బాహుబలి పై ఆ స్థాయిలో ప్రమోషన్లు చేయించారు.

మేకింగ్ వీడియోలు, దేశ విదేశాల్లో ప్రమోషన్ల షూటింగ్ లు, విడుదల తేదీకి ముందు చేసే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలు ఇలా ఒక్కొటి అన్ని రాజమౌళి మైండ్ లో నుంచి వస్తుంటాయి. దీనికి తగ్గట్లు హిరో, హిరోయిన్ల డేట్లు, చిత్ర యూనిట్ సహకారం అన్నింట్లో రాజమౌళికి ఫ్లస్. అయితే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిట్టి అంటూ భైరవ అంటూ ప్రభాస్ తాను వాడే కొత్త కారు.. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా ఈవెంట్.. ఇలా ఎన్నో రకాలుగా ప్రమోషన్లు చేశారు. కానీ సరైన ఫ్లాన్ తో వెళ్లకపోవడమే ఇక్కడ పబ్లిసిటీ రాకపోవడానికి కారణం అని తెలుస్తోంది. తెలుగు మీడియాకు ఇప్పటి వరకు కల్కి టీం సరైన ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. కేవలం ముంబయి లో ఒక్క సారి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. నాగ్ అశ్విన్ కు కేవలం స్వప్న దత్ మాత్రమే సహకరిస్తున్నారు. ఇంకా మూడు రోజుల్లో కల్కి 2898 ఏడీ విడుదల ఉన్న సమయంలో ఇంకా లాస్ట్ మినిట్ పనులు నాగ్ అశ్విన్ బిజీ బిజీగా ఉన్నారు.

టీం ఈవెంట్లలో పాల్గొనకుండానే సినిమా రిలీజ్ కాబోతుంది. టికెట్లు ఎక్కడికక్కడే బుక్ అవుతున్నా.. కూడా దేశ వ్యాప్తంగా కల్కి రిలీజ్ కు సంబంధించి పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఒక్కో ఈవెంట్ ను దర్శకుడు రాజమౌళి ఉపయోగించుకున్నట్లు నాగ్ అశ్విన్ వాడుకోలేదని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

TAGS