5G Spectrum Auction : నేడు పదో విడత 5జీ స్పెక్ట్రమ్ వేలం

5G Spectrum Auction

5G Spectrum Auction

5G Spectrum Auction : నేడు (మంగళవారం) పదవ విడత 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు నేడు జరగనుంది. మొత్తం ఎనిమిది బ్యాండ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వేలం నిర్వహించనుంది.

రూ.96,317.65 కోట్ల విలువైన ఎయిర్‌వేవ్స్‌ను వేలం వేసి నికరంగా రూ.10వేల కోట్లు రాబట్టాలని కేంద్రం భావిస్తోంది. 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లకు వేలం జరగనుంది. ఈ వేలం కోసం రిలయన్స్ జియో ఇప్పటికే ఈఎండీగా రూ.3,000 కోట్లు, భారతి ఎయిర్ టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్లు చెల్లించాయి.

ఈ స్పెక్ట్రమ్‌కు 20ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను సంస్థలు ట్రేడ్ లీజ్ లేదా సరెండర్ చేయొచ్చు.

TAGS