AUS Vs AFG : T20లో సంచలనం.. ఆసీస్‌ను ఓడించిన అఫ్గాన్‌

AUS Vs AFG

AUS Vs AFG

AUS Vs AFG : ఏంటా.. T20 కప్‌ సూపర్‌-8 గ్రూప్‌-1లో సెమీస్‌ రేసు చప్పగా సాగుతుందని భావించిన అభిమానులను ఆఫ్ఘనిస్తాన్ థ్రిల్‌ చేసింది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆసిస్ ను ఓడించి సెమీస్‌ రేసును ఊహించని విధంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి ఉంటే.. భారత్‌తోపాటు ఆ జట్టు నాకౌట్‌కు వెళ్లేది. కానీ, అఫ్గాన్‌ తాము కూడా రేసులో ఉన్నామని గెలుపుతో నిరూపించుకుంది.

T20 ప్రపంచ కప్‌లో సంచలనం నమోదైంది. గ్రూప్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు సూపర్ 8లో ఆస్ట్రేలియాను 21 రన్స్ తేడాతో చిత్తు చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆసీస్‌పై విజయం సాధించడం ఆఫ్ఘనిస్తాన్ కు ఇది తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకు 6 సార్లు ఈ రెండు తలపడగా.. ఐదు మ్యాచుల్లో ఆస్ట్రేలియానే గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51)తో హాఫ్ సెంచరీలు ముగించారు. ఆసిస్ పేసర్ పాట్ కమిన్స్‌ (3/28) T20లో రెండో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

గుల్బాదిన్ సూపర్ బౌలింగ్‌
అనంతరం 149 లక్ష్యంతో బరిలో దిగిన అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ వెనుకబడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59) ఆఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా వారు విఫలం కావడంతో ఆస్ట్రేలియా 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నవీనుల్ హక్ (3/20), రషీద్ ఖాన్ (1/23), ఒమర్జాయ్‌ (1/10), నబీ (1/1) మంచి ప్రదర్శన కనబరిచారు. దీంతో గ్రూప్‌ 1లో భారత్‌ రెండు విజయాలు సాధించి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. 

TAGS