America : అమెరికాలో దుండగుడి కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి
America : రాను రాను కలల దేశం కాట్నం తోవ చూపుతోంది. కోటి ఆశలు, ఆశయాలతో పొరుగుదేశం పోతే ప్రాణాలు నిలవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఏం పీడ పట్టిందో ఏమో కాని. అమెరికాలో ప్రవాసుల బతుకు దిన దిన గండంగా గడుస్తుంది. అయితే యాక్సిడెంట్, లేదంటే మర్డర్, ఇంకా కిడ్నప్ ఇది భారతీయుల విషయంలోరనే ఎక్కువగా జరగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఒక దుండగుడి కాల్పుల్లో ప్రవాసీయుడు, అందునా తెలుగు వాడు కన్నుమూశాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, యాజలి గ్రామంకు చెందిన గోపీకృష్ణ జీవనోపాధికి ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్సాస్ లోని ఒక సూపర్ మార్కెట్ లో పనికి కుదిరాడు. చక్కగా పని చేసుకుంటుండగా.. రోజూ మాదిరిగానే శనివారం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా.. ఒక దుండగుడు సూపర్ మార్కెట్ లోని కస్టమర్ గా వచ్చి తుపాకీతో గోపీ కృష్ణపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపీ అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం దుండగుడు వస్తువులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.
కాసేపటికి స్టోర్ కు వచ్చిన వారు గోపీ కృష్ణను మాస్పిటల్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం (జూన్ 23) చనిపోయాడు. సమాచారం యాజలిలోని కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. గోపీకి భార్య, కుమారుడు ఉన్నారు. గోపీ స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దుండగుడు గోపీపై కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.