Ranbir Kapoor : రణబీర్ కపూర్ ఆ ప్రభావం పడకుండా చేయగలడా?
Ranbir Kapoor : రణబీర్ కపూర్ కు సినీ పరిశ్రమతో విడదీయలేని అనుబంధం ఉంది. తండ్రి వారసత్వంతో సులువుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనదైన మార్క్ తో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన యానిమల్ బంపర్ హిట్టయ్యింది. రణబీర్ కపూర్ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఇదే కావడం విశేషం. ఈ సినిమా విజయం తో పాటు వివాదాలకు కేంద్రబిందువైంది. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కించాడు.
పదేళ్ల క్రితం, అనురాగ్ కశ్యప్ యొక్క ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ ఇండియన్ సినిమా తెరపై అత్యంత హింసాత్మక చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ని అధిగమించిందనే విమర్శలు వచ్చాయి. హింసతో పాటు, అనేక ఇతర అంశాలు సినిమాలో ఉన్నాయి. సినిమా సక్సెస్ కావడంతో వివాదాలు పెద్దగా లెక్కలోకి రాలేదు. కానీ ఇప్పుడు రణబీర్ కపూర్ నటిస్తు్న్న రామాయణ్ సినిమా చర్చ జరుగుతున్నది.
ఈ కొత్త రామాయణ్ లో రాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మ గా సాయి పల్లవి నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు అసలు చర్చ రణబీర్ కపూర్ మీదనే నడుస్తున్నది. యానిమల్ లాంటి బోల్డ్ కంటెంట్ సినిమా తర్వాత పౌరాణిక చిత్రం చేస్తున్న రణబీర్ ను ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతుండగానే సినిమా చేయొద్దని హెచ్చరించారు. దర్శకుడి మీద కేసు కూడా వేశారు.
యానిమల్ లో రణబీర్ చేసిన క్యారెక్టర్ తాలుకు నెగెటివిటిని రామాయణ్ కు ఆపాదిస్తున్నారు. అలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేసిన రణబీర్ ఈ సినిమా చేయొద్దంటూ పలు హిందూ సంఘాలు హెచ్చరించాయి. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రాముడి క్యారెక్టర్ రణబీర్ తో చేయించడం ఏమిటనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే సినీ విశ్లేషకులు సైతం కొంత ఆశ్చర్యపోతున్నారు. యానిమల్ లాంటి సినిమా చేసిన తర్వాత రణబీర్ రామాయణం సినిమా చేయడం కొంత సాహసమే అంటున్నారు. ఎందుకంటే సినిమా ఏ కొంచెం అటు ఇటు అయినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇందుకు ఆదిపురుష్ సినిమానే ఉదాహరణ. మరో ఆదిపురుష్ కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని ఫిలిం క్రిటిక్స్ సూచిస్తున్నారు.