Mrs. India icon : పంచాయతీ పాలనలో మోడల్, మిసెస్ ఇండియా ఐకాన్.. బిహార్ వనితపై ప్రశంసల జల్లు
Mrs. India icon : ప్రస్తుతం మహిళలు రాజకీయ రంగంలో దూసుకెళ్తున్నారు. గ్రామ కమిటీల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో అనితర సాధ్యమైనవి చేస్తున్నారు. ఇందులో భాగంగా బిహార్‌కు చెందిన ఓ మహిళా నేత వార్తల్లో నిలుస్తున్నారు. సామాజిక సేవ చేస్తూ.. తన కళలతో మోడలింగ్ రంగంలో ముద్ర వేసింది.
బిహార్.. లఖిసరాయ్ జిల్లా, రామ్‌గఢ్ చౌక్ బ్లాక్ ఏరియాలో.. నూన్‌గర్ పంచాయతీ అధిపతి (సర్పంచ్) జూలీ యాదవ్ నాయకురాలిగా నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. మోడలింగ్ రంగంలో ఆమె తన టాలెంట్ చూస్తూ.. 2 రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు. జూలీ యాదవ్ పంచాయితీ పనులతో పాటు కలలను కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇటు సామాజిక సేవ చేస్తూనే అటు మోడలింగ్‌పై ఆసక్తి చూపుతోంది జూలీ యాదవ్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె పంచాయతీలో కీరోల్ పోషిస్తోంది. అంతేకాక మోడలింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తుంది. తన పేరుపై టైటిల్ కూడా గెలుచుకుంది. ఈ పోటీలో దేశంలోని చాలా రాష్ట్రాల మహిళలను ఓడించి ప్రథమ స్థానం దక్కించుకుంది.
లక్నోలో జరిగిన ఈవెంట్‌లో ‘మిసెస్ ఇండియా ఐకాన్’ టైటిల్‌ను జూలీ యాదవ్ గెలుచుకుంది. స్టార్ క్రియేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటి మెహక్ చాహల్.. ఆమెకు కిరీటం తొడిగి విన్నర్ గా ప్రకటించారు. ఈ పోటీలో జూలీ మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.
జూలీ గతంలో కూడా మోడలింగ్ లో చురుకుగా ఉండేది. 2022లో ‘మిస్ ఉత్తరప్రదేశ్’ టైటిల్ గెలుచుకుంది. జూలీ యాదవ్ ప్రస్తుతం నుంగార్ పంచాయతీ అధినేత్రిగా, మహిళా వికాస్ మంచ్ అధ్యక్షురాలిగా ఉంటూ పంచాయతీ అభివృద్ధికి పాటుపడుతుంది. జూలీ అందానికి జనాలు కూడా ముగ్ధులవుతున్నారు.
TAGS Luknow Mrs. India EventMiss UtterpradeshMrs. India iconMrs. India icon Jooli YadavMrs. India icon Juli yadav