Nara Lokesh : అసెంబ్లీలో నారా లోకేష్ ఫస్ట్ డే అండ్ బిగ్ డే!
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన నాయకుడు నారా లోకేశ్. అవును మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాన్ కాదా? అంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంతో అంతకు మించి నారా లోకేశ్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల ఆకృత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది నారా లోకేశ్. దానికి ఆయన ‘యువగళం’ను ఎంచుకున్నారు. ఇది సక్సెస్ కావడంతో టీడీపీకి ఏపీలో విపరీతమైన ఆదరణ వచ్చింది.
2017-19 వరకు చంద్రబాబు కేబినెట్ లో నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పోటీ చేసి గెలిచి చంద్రబాబు కేబినెట్లోకి వచ్చారు. అప్పట్లో ఉత్తమ పనితీరు కనబరిచిన మంత్రిగా కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు.
ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు. అప్పటి వరకు మంత్రిగా ఉన్న లోకేశ్ పై జగన్ దుష్ప్రచారం చేయడంతో లోకేష్ ఓడిపోయాడు. తన వాక్చాతుర్యాన్ని, విషయ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని పార్టీ కేడర్ తో సన్నిహితంగా మెలుగుతూ 3132 కిలో మీటర్లు నడిచి (యువగళం) నాయకుడిగా ఎదిగారు.
1985 తర్వాత 2024 వరకు టీడీపీ గెలవని నియోజకవర్గం మంగళగిరి. క్లిష్టమైన సీటులో పోటీ చేసేందుకు లోకేశ్ వెనుకాడలేదు. పార్టీ నాయకులు, పెద్దలు అక్కడి నుంచి పోటీ చేయద్దని వారించారు, హితవు పలికారు. కానీ ఆయన అవన్నీ పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన సీటును వదలల లేదు. ‘గెలిచే సీటులో పోటీ చేస్తే ఏముంది గొప్ప ఓడిపోయే సీటులో పోటీ చేసి గెలిచి చూపించాలి ఇదే గొప్ప’ అని ఆయన అన్నారు నిరూపించారు కూడా. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి సెలబ్రిటీలందరిలో అత్యధిక మెజారిటీ (91,413 ఓట్ల మెజారిటీ) సాధించారు.
ప్రజల ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన నేను ఈరోజు గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేశాను.#APAssembly #AndhraPradesh #TeluguAtmaGauravamWins pic.twitter.com/zso4Z4iYuR
— Lokesh Nara (@naralokesh) June 21, 2024
మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. లోకేశ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 2017 నుంచి మొన్నటి వరకు తనపై ఎన్ని అవమానాలు, దుష్ప్రచారాలు జరిగినా లోకేష్ గట్టిగానే స్పందించి ఆరోపణలు తప్పని నిరూపించారు. లోకేశ్ ఇప్పటికే 2017-19లో తన సబ్జెక్టు నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకున్న ఆయన వాక్చాతుర్యం ఉత్తమమైంది.