CAG Sensational Report : ప్రపంచ కుబేరుడిగా కేసీఆర్.. కాగ్ సంచలన రిపోర్ట్

  • ఆయన పాలన కాలంలో దారిమళ్లించిన సొమ్ము 2,88,811 కోట్లు..
CAG Sensational Report

CAG Sensational Report

CAG Sensational Report : తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్ గద్దె దిగిపోయారు. ఈ పదేళ్లలో జరిగిన పనులన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేసీఆర్ హయాంలో సీఎం మాటే వేదంగా అధికారులు నడుచుకున్నారు. దీంతో చట్టాలు, విధానాల్ని పక్కన పెట్టి పని చేసుకుంటూ పోయారు. ఇప్పుడే ఆ విషయాన్ని బయటకు తీస్తుంటే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల్ని తనిఖీ చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ సంచలన విషయాలను బయటపెట్టింది.

ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులను తనిఖీ చేయడం..  కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం కర్తవ్యం. ఇందులో భాగంగా కేసీఆర్ ఏ రకంగా డబ్బులు ఖర్చు పెట్టిందన్న విషయాన్ని ఓ నివేదిక రూపంలో కాగ్ బయటపెట్టింది. కాగ్ ఇచ్చిన నివేదికలోని కొన్ని సంచలన విషయాలు..

నియమ నిబంధనలను పాటించకుండా కేసీఆర్ సర్కార్ రెండు లక్షల 88 వేల 811 కోట్లను దారి మళ్లించారని కాగ్ తేల్చింది. 2014-2022 వరకు ఎనిమిదేళ్ల పరిపాలన మీద కాగ్ ఈ నివేదిక వెల్లడించింది తర్వాత ఏడాదిన్నరకు సంబంధించిన పూర్తిస్థాయి లెక్కలు ఇంకా తేలలేదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం జమా ఖర్చులకు సంబంధించి బడ్జెట్ తయారుచేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. భారత రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్ ప్రకారమే డబ్బులు ఖర్చు పెట్టాలి.

అత్యవసర పనులకు కొంతమేర డబ్బులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఒకవేళ బడ్జెట్ దాటి డబ్బులు ఖర్చుపెట్టినట్లయితే దానికోసం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వారి పర్మీషన్ తీసుకోవాలి.  అసెంబ్లీలో కొందరు శాసనసభ్యులతో ఏర్పాటు అవుతుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన ఖర్చులు విషయాలు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చెప్పి వారి పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ కేసీఆర్ సర్కార్ ఏనాడు ఆ పని చేయలేదని కాగ్ తేల్చింది.  కాళేశ్వరం ప్రాజెక్టు, మెట్రో స్కాం, ధరణి ప్రాజెక్టు, గొర్రెల కొనుగోలు వంటి అంశాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోని లక్ష కోట్ల దాకా డబ్బు  లెక్కా, పత్రం లేకుండా బయటికి వెళ్లిపోయిందని కాగ్ అభిప్రాయబడింది. ముఖ్యమంత్రి కొందరు సీనియర్ మంత్రుల ఆదేశాలతో ఉన్నతాధికారులు నిబంధనలు పట్టించుకోకుండా కోట్లకు కోట్లు విచ్చలవిడిగా విడుదల చేశారని స్పష్టం చేసింది.

ఈ డబ్బులు లెక్కా పత్రం లేకుండా వాడేయడం ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో రూ.303 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, 2015 – 16 లో 580 కోట్ల ఖర్చు పెట్టారు. ఆ తర్వాత దూకుడు పెరిగింది. 2016-17 లో 21,161 కోట్లు,  2017-18 లో 28,171 కోట్లు,  2018-19 లో 29,173 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది.  2019-20 లో 47,896 కోట్లు, 2020-21 లో 81,514 కోట్లు, 2021-22 లో 75,053 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. దీనిని బట్టి ఈ ప్రవాహం ఎలా సాగిందో అర్థం అవుతుంది. ప్రతి సంవత్సరం రెండు మూడుసార్లు సమావేశం పెట్టించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏమాత్రం పట్టించుకోలేదు.  దీంతో ఈ నివేదిక మీద రాజకీయ దుమారం రేగడం ఖాయం.

TAGS