CM Chandrababu : ప్రజావేదిక శిథిలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : ఏపీలో  వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంతకు ముందు నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేసింది. ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చేసిన జగన్ ప్రభుత్వం .. దాని శిథిలాలను కూడా అక్కడ నుంచి తొలగించకుండా అలాగే ఉంచింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రజావేదిక కూల్చివేతతో పాటు శిథిలాలను కూడా తొలగించకుండా ఐదేళ్ల పాటు అలాగే ఉంచేయడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.  తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజావేదికను తిరిగి నిర్మిస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

సీఎం చంద్రబాబు వైసీపీ సర్కార్  కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని  తెలుసున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సీఎం వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు పలువురు ఉన్నారు. శంకుస్థాపన ప్రాంతం పరిశీలిన అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల పరిశీలించారు. ఐకానిక్‌ నిర్మాణాల కోసం గత  టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళతారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతారు.

TAGS