ENG Vs WI : విండీస్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. ఫామ్ లోకి వచ్చినట్లేనా?

ENG Vs WI

England Vs West Indies

ENG Vs WI : టీ20 ప్రపంచ కప్ ఫెవరేట్ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ లీగ్ దశలో తడబడుతూ సూపర్-8 లోకి చేరుకుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లాండ్ చెలరేగిపోయింది.  వెస్టిండీస్ ను చిత్తు గా ఓడించింది. ఫిలిప్ సాల్ట్ – జానీ బెయిర్‌స్టో తుఫాను బ్యాటింగ్ తో సూపర్-8లో వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. సెయింట్ లూసియాలోని గ్రాస్ ఐలాండ్స్‌లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్‌ మంచి ఒపెనింగ్ తో ఆటను ప్రారంభించింది. తొలుత రెండు వికెట్లు కోల్పోయినా, ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో  ధాటిగా బ్యాటింగ్‌  చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. దీంతో ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులతో అజేయంగా నిలిచారు ఆండ్రీ రస్సెల్, రోస్టన్ చేజ్ చెరో వికెట్ తీశారు. వీరిద్దరూ వెస్టిండీస్ లోని ప్రతి  బౌలర్‌కు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ హడలెత్తించారు. చేజింగ్ లో జాస్ బట్లర్ (25), మొయిన్ అలీ (13) రూపంలో రెండు వికెట్లు పడ్డాయి. అయినా ఆటలో ఇంగ్లాండ్ దే పై చేయిగా నిలిచింది.  

పూరన్  స్లో  ఇన్నింగ్స్
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఆటను అద్భుతంగా ప్రారంభించింది. బ్రాండన్ కింగ్ 13 బంతుల్లో 3 ఫోర్లు , ఒక సిక్సర్ కొట్టి రిటైర్డ్ అయ్యాడు. దీని తర్వాత జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ పరుగుల వరద పారించారు. చార్లెస్ ఔటయ్యే సమయానికి వెస్టిండీస్ స్కోరు 11.1 ఓవర్లలో 94 పరుగులు. రోవ్‌మన్ పావెల్ 17 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి 36 పరుగులు చేశాడు.  ఇందులో లియామ్ లివింగ్‌స్టోన్ అదే ఓవర్‌లో కొట్టిన హ్యాట్రిక్ సిక్సర్లు కూడా ఉన్నాయి. నికోలస్ పూరన్ కొంచెం నెమ్మదించాడు. 32 బంతుల్లో 36 పరుగులు చేయగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 15 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు ఇంగ్లండ్‌ కేవలం ఒక విజయం దూరంలో
సూపర్‌-8లో గ్రూప్‌-2లో చేరింది. వారికి 2 పాయింట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి ఇంగ్లండ్‌కు ఇప్పుడు కనీసం ఒక మ్యాచ్ లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. జూన్ 21న దక్షిణాఫ్రికాతో, జూన్ 23న అమెరికాతో ఆడాల్సి ఉంది. మరోవైపు జూన్ 22న యూఎస్ఏతో, జూన్ 24న దక్షిణాఫ్రికాతో విండీస్ ఆడనుంది.

TAGS