Rajinikanth : రజనీ కాంత్ ను సెలవు పెట్టి వెళ్లపోవాలన్న టీవీ 9 యాజమాన్యం?

Rajinikanth

Rajinikanth

Rajinikanth : టీవీ 9లో బ్రేకింగ్ న్యూస్ వేసే రజనీ కాంత్ బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. ఆయనను సంస్థ నుంచి వెళ్లిపోవాలని యాజమాన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో టీవీ 9 స్క్రీన్ పై రజనీకాంత్ ఇక కొంత కాలం కనిపించే అవకాశం లేదు. ఆయన ను సెలవు పెట్టి వెళ్లిపోవాలని యాజమాన్యం సూచించింది. ఇప్పటికే ఆయన ఎలాంటి చర్చా కార్యక్రమాలు పెట్టవద్దని స్పష్టం చేయడంతో మంగళవారం టీవీ9లో స్టోరీలతో ప్రైమ్ టైమ్ నింపేశారు. తాజాగా ఆయన చానల్ రోజువారీ వ్యవహారాలు కూడా చూడాల్సిన అవసరం లేదని సెలవుపై వెళ్లాలని యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో ఆయన వారం పాటు సెలవుపై వెళ్తున్నట్లుగా సన్నిహితులకు సమాచారం ఇచ్చారు.

టీవీ 9 ఇంత కాలం అధికార పార్టీలకు చేసిన ఊడిగం కారణంగా.. మొన్నటి దాకా ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు అధికార పార్టీలకు పీకల మీద దాకా కోపం ఉంది. ఆయన వల్లే టీడీపీ, జనసేన పార్టీలు టీవీ 9ను బాయ్ కాట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.  టీవీ 9 యాజమాన్యానికి లెక్కకు మించి వ్యాపారాలున్నాయి.  ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తే  వారికి భారీ డ్యామేజీ జరుగుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే.. ఇప్పుడు వారికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ .. రజనీకాంత్ ను తొలగించడం.

రవిప్రకాష్ చేతి నుంచి ఛానల్ చేజారిపోయిన తర్వాత రజనీకాంత్ బ్యాట్ అందుకున్నారు. మై హోమ్ ఓనర్ల మనసు దోచి రవిప్రకాష్ ప్లేస్ రజనీ కాంత్  ఆక్రమించేసుకున్నారు. జర్నలిజంలో కనీస పరిజ్ఞానం లేదని ఆయనతో మాట్లాడిన ఎవరికైనా తెలిసిపోతుందని ఆ కాంపౌండ్‌లో సెటైర్లు పడినా.. యజమానులకు కావాల్సిన జర్నలిజం చూపడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే కొన్నాళ్లుగా ఆయన హవా కొనసాగింది.  ఇప్పుడు కూడా తనకు తెలిసిన టీడీపీ నేతలతో కలిసి రాజీ ప్రయత్నాలు చేసినా.. గతంలోలా పరిస్థితులు చక్కబడకపోవడంతో రజనీకాంత్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

TAGS