Ester Noronha : గ్లామర్ పెంచితే వేశ్య అంటారు.. మాకు కూడా కోరికలు ఉంటాయి.. ఎందుకు ఉండొద్దు

Ester Noronha

Ester Noronha

Ester Noronha : ఎస్తర్ నోరాహ అనగానే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తు పడతారు. బబ్లీ బ్యూటీ అయిన ఎస్తర్ ఈ మధ్య టోటల్ గా గ్లామర్ డోస్ పెంచేసింది. ఇంటర్వ్యూలలో కూడా తన ఎద అందాలు చూపిస్తూ హాట్ హాట్ గా కనిపిస్తోంది. తెలుగులో హిరోయిన్ గా నటించింది. కానీ సినిమాలు విజయవంతం కాకపోయే సరికి పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం వ్యక్తిగత జీవితంలో సింగర్ నోయల్ తో పెళ్లి జరిగింది.

వీరిద్దరూ దాదాపు 6 నెలలు కలిసి ఉన్నా.. కేవలం 16 రోజులు మాత్రమే మేం కలిసి ఉన్నామని ఎస్తర్ పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న ఈ భామను మళ్లీ పెళ్లిచేసుకుంటారా అని అడిగితే ఎందుకు చేసుకోకూడదు. నాకు కూడా కోరికలు (ఎమోషన్స్ ) ఉంటాయి కదా.. అని బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే గ్లామర్ రోల్స్ చేసే వారిని సమాజంలో చిన్న చూపు చూస్తారని ఆ విధానం మరీ ఘోరమని అంది. సినిమాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పిన భామ.. అసలు ఈ మధ్య ఆడవాళ్లు కూడా కమిట్ మెంట్ అడుగుతున్నారని తెలిపింది.

ఇలా బోల్డ్ కామెంట్స్ ఎవరూ చేయలేరని సినీ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. తెలుగులో ఎస్తర్ సునీల్ తో కలిసి భీమవరం బుల్లోడు సినిమాలో యాక్ట్ చేసింది. అది పెద్దగా హిట్ కాలేదు. ప్రెజెంట్ 69 సంస్కార్ కాలనీ, రెక్కీ అనే సినిమాల్లో రొమాంటిక్స్ సీన్స్ లో నటించింది. అయితే ఈ సీన్ లలో మామూలుగా కాకుండా జీవించేసింది. అంతలా అలా రెచ్చిపోయి అందాలు చూపించడంతో ప్రేక్షకులు ఎస్తర్ కు ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం హిరోయిన్ గా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, నిర్మాతగా, దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకునేందుకు సిద్ధమైంది. ది వేకెంట్ హౌస్ అనే సినిమాకు నిర్మాత, దర్శకురాలిగా వ్యవహరిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏమైనా ఎస్తర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

TAGS