Hero Suriya : సూర్య ఫ్యామిలీలో చిచ్చుపెట్టిన జ్యోతిక.. అసలు నిజమేంటో చెప్పిన కార్తి
Hero Suriya : తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చేతినిండా సినిమాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. అలాగే, ఆయన కుటుంబం నుంచి కార్తి, జ్యోతిక కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా కుటుంబం మొత్తం సినీ రంగంలో సత్తా చాటుతోంది. మరో పక్క వాళ్ల కుటుంబంలో విభేదాలు అంటూ తరచూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో కార్తి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సూర్య తన తల్లిదండ్రులు శివకుమార్, లక్ష్మీతో పాటు సోదరుడు కార్తీతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నాడు. వీరిది ఉమ్మడి కుటుంబం అయినా అంతా అన్యోన్యంగా ఉంటారు. అలాంటిది కొంత కాలం క్రితం సూర్య తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబై నగరానికి మకాం మార్చేశారు.
సూర్య ముంబై నగరానికి షిఫ్ట్ అవడంతో పాటు ఏకంగా రూ.70 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నారని, ఇకపై అక్కడే ఉండబోతున్నాడన్న వార్త కొద్ది నెలల క్రితమే బయటకు వచ్చింది. తర్వాత సూర్య ముంబైలోని ఓ ఇంటి నుంచి బయటకు వచ్చి హోటళ్లకు వెళ్తున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో వాళ్లు మకాం మార్చింది నిజమేనని స్పష్టం అయింది. సూర్య తన భార్య, పిల్లలతో కలిసి ముంబై నగరానికి షిఫ్ట్ కావడంపై ఎన్నో రకాల పుకార్లు వచ్చాయి. అయితే, ‘సూరరై పొట్రు’ హిందీలో కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికలే నిర్మిస్తున్నారు. దీనికితోడు జ్యోతిక కూడా వరుసగా బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఈ కారణంగానే వాళ్లు అక్కడకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది.
సూర్య కుటుంబం ముంబై వెళ్లడానికి సినిమాలే కారణం అని మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత మాత్రం ఫ్యామిలో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. సూర్య తల్లిదండ్రులకు జ్యోతిక సినిమాలు చేయడం ఇష్టం లేదని, ఈ కారణంగానే ఆమె సూర్యతో వేరే కాపురం పెట్టించిందని టాక్ వచ్చింది. తాజాగా దీనిపై కార్తి స్పందించాడు. ఈ మేరకు ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘నేను జ్యోతికను ఎప్పుడూ వదినలా చూడలేదు. అమ్మలాగే చూస్తాను. తను కూడా నన్ను కొడుకులానే భావిస్తారు. వదిన ఇప్పుడు ముంబైలో ఉండడంతో ఇల్లంతా బోసిపోయింది. ఆమె లేకపోతే మేము ఉండలేకపోతున్నాం. ఇన్నేళ్ల నుంచి మేమంతా అన్యోన్యంగా కలిసి ఉన్నామంటే దానికి జ్యోతిక వదినే కారణం. తను మా అందరినీ మంచిగా చూసుకునేవారు. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. వాళ్ల చదువులు ముఖ్యం. అందుకోసమే ముంబై వెళ్లిపోయారు. అవి పూర్తైన తర్వాత మళ్లీ కలిసే ఉంటాము. అప్పటి వరకూ దూరం తప్పదు’ అంటూ చెప్పుకొచ్చారు కార్తీ.