RRR – Chandrababu : ఆర్ఆర్ఆర్ చంద్రబాబు షాక్..? అందుకే మంత్రి పదవి ఇవ్వలేదా?

RRR - Chandrababu

RRR – Chandrababu

RRR – Chandrababu : ఇటీవల జరిగిన ఎన్నికల్లో 164 సీట్లతో కూటమి అధికారంలోకి రాగా.. చంద్రబాబు సీఎంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వీరితో పాటు కేబినెట్ లో 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో పదవుల పంపకంలో టీడీపీ నేతలకు మొండిచేయి ఎదురైంది.

అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణ, పరిటాల సునీత వంటి సీనియర్ నేతలకు మంత్రి పదవులు దగ్గలేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రఘురామ కృష్ణంరాజుకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు కొద్ది కాలానికే ఆ టీడీపీలో చేరారు.

వైసీపీ విధానాలపై నిత్యం పోరాడేవారు. సోషల్‌ మీడియా, యూ ట్యూబ్‌ ద్వారా విమర్శలు చేసేవారు. విచిత్రంగా ఆయనకు కూటమిలోని మూడు పార్టీలు సీటు ఇవ్వలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి విమర్శలు రావడంతో ఉండి అభ్యర్థిని తప్పించి రఘురామకు సీటిచ్చారు బాబు. ఈ నేపథ్యంలో తీవ్ర పోటీని తట్టుకోని కూడా ఆయన విజయం సాధించారు. అయితే తనకు మంత్రి పదవి, లేదంటే శాసనసభ స్పీకర్‌‌ పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.

అయితే స్పీకర్ స్థానానికి అయ్యన్నపాత్రుడి పేరు వినిపిస్తుండడంతో రఘురామ కృష్ణంరాజుకు మొండిచేయి ఎదురైంది. మరో వైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అధిష్టానంపై గుస్సాగా ఉన్నారు. మర మంత్రి పదవి దక్కకపోవడంపై రఘురామ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

TAGS