IPS Officers : తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు..  

IPS Officers

IPS Officers

IPS Officers : తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌ అధికారులను  బదిలీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల కిందట 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్,  తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొంత మంది అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా బదిలీ అయిన వారిలో కొందరిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేసింది. బదిలీ అయిన జాబితాలో చాలా మంది సీనియర్ నేతలతోపాటు కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు సైతం ఉన్నారు. కేవలం ఒక శాఖకు మాత్రమే పరిమితం చేయకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సైబర్ సెక్యూరిటీస్, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఇలా అనేక డిపార్ట్ మెంట్లలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో బదిలీ అయిన ఐపీఎస్‎లు వీరే
అశోక్‌కుమార్‌- జగిత్యాల ఎస్పీ
సన్‌ప్రీత్‌సింగ్‌- సూర్యాపేట ఎస్పీ
రాహుల్‌ హెగ్డే- హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ
టీ శ్రీనివాసరావు- జోగులాంబ గద్వాల ఎస్పీ
జానకి ధరావత్‌- మహబూబ్‌నగర్‌ ఎస్పీ
డీవీ శ్రీనివాసరావు- కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ఎస్పీ
కే సురేశ్‌ కుమార్‌- బాలానగర్‌ డీసీపీ
హర్షవర్దన్‌- సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ
విశ్వజిత్‌- సీఐడీ ఎస్పీ
బీ రాజేష్‌- శంషాబాద్ డీసీపీ
కే నారాయణరెడ్డి- వికారాబాద్‌ ఎస్పీ
రుత్‌రాజ్‌- ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌
శరత్‌ చంద్రపవార్‌- నల్గొండ ఎస్పీ
ఎన్‌.కోటిరెడ్డి- మేడ్చల్‌ జోన్‌ డీసీపీ
నితికా పంత్‌- ఆదిలాబాద్‌ పీటీసీ ఎస్పీ
చందనా దీప్తి- సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ
షేక్ సలీమా- వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ
సాధన రష్మి పెరుమాళ్‌- హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీ
సాయి చైతన్య- హైదరాబాద్ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీ
బీ మహేంద్ర నాయక్‌- జనగామ వెస్ట్‌ జోన్‌ డీసీపీ
ఎ. భాస్కర్‌- మంచిర్యాల డీసీపీ
రోహిణి ప్రియదర్శిని- డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌

TAGS