Kartika Masam Rules : కార్తీక మాసంలో ఏ నియమాలు పాటించాలో తెలుసా?
Kartika Masam Rules : కార్తీక మాసమంటే హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో అత్యంత నియమ నిష్టలతో గడుపుతారు. శివకేశవులకు ఇష్టమైన మాసం కూడా ఇదే. అందుకే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దేవుళ్లకు అభిషేకాలు చేయడం పరిపాటి. అటు విష్ణువు, ఇటు శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. ఎటు చూసినా హరిహరుల నామమే జపిస్తుంటారు.
మద్యం ముట్టరాదు. మాంసం తినరాదు. మగువ పొందు కోరరాదు. ఇలా నిష్టలతో భగవంతుడి నామం స్మరిస్తే పుణ్యం వస్తుందని స్కంధ పురాణం చెబుతోంది. పండితుల అభిప్రాయం కార్తీక మాసంలో చేసే పూజలు దేవుళ్లకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. అందుకే రోజు విడవకుండా భక్తులు భగవంతుని కొలవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో సైన్స్ కూడా దాగి ఉంది. చలి కాలంలో మనం తిన్న పదార్థాలు త్వరగా జీర్ణం కావు. అందుకే మాంసాహారాలను పక్కన పెట్టాలని చెబుతారు. మాంసాహారాలు మానేయడం వల్ల మన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కార్తీక మాసంలో మాంసం జోలికి వెళ్లొద్దని హితవు చెబుతారు. ఇలా విజ్ణాన శాస్త్రం కూడా మాంసం వద్దనే చెబుతుంది.
కార్తీక మాసంలో మనం చేసే పూజలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. దేవాలయ సందర్శన ఎంతో పుణ్యం తెస్తుంది. దేవుళ్లను కొలవడం మంచి ఫలితాలు కలిగిస్తుంది. దీంతో భక్తులు కార్తీక మాసంలో శివ, విష్ణువులను కొలవడం వల్ల చాలా రకాల పుణ్యం లభిస్తుందని విశ్వాసం. కార్తీక మాసంలో నెల రోజులు ఈ నియమాలు పాటిస్తే దేవుళ్లు మనపై ప్రేమ కురిపిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.