Revolt Against Jagan : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తిరుగుబాటు.. జగన్ కు కూడా తప్పదా?
Revolt Against Jagan : తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది. వారు ప్రచారం చేసే సమయంలో చాలా మంది ఎదురు దాడికి దిగుతున్నారు. ఏం చేశారని ఓట్లడగడానికి వస్తున్నారు. మీ పనులు పేదలకు ఏం మేలు చేశాయని నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారంటూ ప్రశ్నించడం గమనార్హం.
ఓట్ల కోసం వెళ్లే వారికి చాలా చోట్ల అవమానాలు ఎదురవుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఏవో కాకి లెక్కలు చెబుతూ ఓట్లడిగితే ఎవరు ఊరుకుంటారు? ఇంటికి పెన్షన్ వస్తుందా? అని అడుగుతున్నారు కానీ ఇంటికో ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారా? దీంతో చాలా మంది ఓటర్లు నాయకులను నిలదీస్తున్నారు.
సర్వేలన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నందున బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారానికే రావొద్దంటూ అసహ్యించుకుంటున్నారు. మీరు ఏం చేశారని ప్రచారానికి వస్తున్నారు? ఏం సాధించారు? ఏ పథకాలు తీసుకొచ్చారు? అడిగినవి అటకెక్కించారు? నకిలీవి మాత్రం చెలామణిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదో వెలగబెట్టినట్లు ఓట్లు అడగడానికి రావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ఇక్కడ నుంచి వెళ్లండని చీదరించుకున్నారు. దీంతో వారు మిమ్మల్ని ఓట్లడగానికి రాలేదని ఆగ్రహంగా చెప్పారు. ఇలా వారికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని సర్వేలు సూచిస్తుండటంతో కేసీఆర్ కు ఇదివరకే భయం పట్టుకుంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకు గెలుపు భయం పెరుగుతోంది.
ఇదే పరిస్థితి ఏపీ సీఎం జగన్ కు కూడా తప్పదన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్తంగా మారింది. అన్ని వర్గాలపై దోపిడీ, దొంగతనం, కబ్జాలు, ఖూనీలు చేస్తూ రాష్ట్రంలో మరో నియంతగా అవతరిస్తున్నాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు చరమగీతం పాడటం తప్పనిసరని తెలుస్తోంది. దీంతో ఏపీలో అధికార మార్పిడి తప్పదనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.