Viral Video : రిషి సునాక్, గియోర్జియా మెలోని వీడియో వైరల్.. ‘పరిమితులు తెలుసుకోవాలి’ అంటున్న నెటిజన్లు

PM Rishi Sunak

UK PM Rishi Sunak – Giorgia Meloni

Viral Video : ఇటలీలోని అపులియా ప్రాంతంలో G7 శిఖరాగ్ర సదస్సు కొసాగుతోంది. ఈ రోజు (జూన్ 15) తో సదస్సు ముగుస్తుంది. ఈ సదస్సుకు వస్తున్న అతిథులను ఇటలీ ప్రధాని ప్రధాని గియోర్జియా మెలోని స్వాగతం పలికారు. అయితే ఇందులో ఒక వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

స్టేజీ పైకి వచ్చిన బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్ కు మెలోని పెక్ ఇచ్చింది. ఆ తర్వాత వారు కౌగిలింతతో పలకరించుకున్నారు. ఈ క్షణాన్ని వీడియోల్లో బంధించి ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టారు. సునక్ మెలోని వద్దకు చేరుకోవడంతో వీడియో ప్రారంభమవుతుంది. అతను మెలోనిని స్నేహ పూర్వక కౌగిలింత, ముద్దుతో పలకరిస్తాడు. ఇద్దరూ కలిసి ఫోటోకు ఫోజులిచ్చే ముందు ఒక క్షణం నవ్వు, సంభాషణ కొనసాగుతుంది.

అయితే, కొంతమంది నెటిజన్లు కౌగిలింత-ముద్దు (పెక్)ల ఇబ్బంది కలిగించిందని చెప్పారు. దేశాల అగ్రనేతల విషయంలో కాస్త సంయమనం పాటించాలని ‘మీమ్స్’, ‘జోకుల’తో ఈ వీడియోలను ఫొటోలను వైరల్ చేయడం కరెక్ట్ కాదని కొందరు, మనకున్న కొన్ని పరిమితులు తెలుసుకోవాలని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉండగా.. భారత్ ఒక ఔట్ రీచ్ దేశంగా ఈ సదస్సులో పాల్గొంటోంది. అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఎగ్నాజియా రిసార్ట్ లో జూన్ 13 నుంచి 15 వరకు సదస్సు కొనసాగింది. ఇటలీ ప్రధాని గియోర్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

గురువారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) అపులియాలోని బృందిసి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇటలీలోని భారత రాయబారి వాణీరావు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి రావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. గతంలో తాను ఇటలీ పర్యటన, ప్రధాని గియోర్జియా మెలోనీ భారత పర్యటన చేయడం ద్వైపాక్షిక సంబంధాలు పెరిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన గుర్తు చేశారు.

G7 శిఖరాగ్ర సదస్సు కోసం వరుసగా మూడోసారి ఇటలీలో పర్యటించడం సంతోషంగా ఉంది. 2021లో జరిగే G7సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లిన విషయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా. గతేడాది ప్రధాని మెలోనీ 2 సార్లు భారత్ లో పర్యటించడం ద్వైపాక్షిక ఎజెండాలో వేగం, లోతును పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్, మధ్యదరా ప్రాంతాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని భారత ప్రధాని మోడీ అన్నారు.

TAGS