Diwali celebrated 2023 : దీపావళి ఏ రోజున జరుపుకోవాలో తెలుసా?
Diwali celebrated 2023 : ఈసారి అధిక మాసం కావడంతో పండుగలు రెండు రోజులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి గురించి కూడా రకరకాల ప్రచారాలు వస్తున్నాయి. కొందరేమో శని, ఆదివారాలు జరుపుకోవాలని చెబుతుంటే మరికొందరేమో ఆది, సోమవారాలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పండగ రోజులు ఏంటో అర్థం కాకుండా ఉంది.
వాస్తవానికి అమావాస్య రోజు నరక చతుర్థి అంటారు. అదే రోజు మహాలక్ష్మిని పూజించడం మన సంప్రదాయం. సత్యభామ నరకాసురుడని ఇదే రోజు హతమార్చిందని దానికి గుర్తుగానే దీపావళి జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు దీపావళి విషయంలో తప్పుడు దారుల్లో సూచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండితులంతా కూర్చుని ఒకే మాట చెబితే ప్రజలకు ఎలాంటి అపోహలు ఉండవు. కానీ మనిషికో విధంగా చెబితేనే అందరికి అనుమానాలు పెరుగుతుంటాయి.
నవంబర్ 12న దీపావళి అని కొందరు పండితులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం 13న దీపావళి అని చెప్పడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీపావళి రోజే మహాలక్ష్మిని పూజించడం చేస్తుంటాం. సత్యభామ నరకాసురుడిని వధించిన రోజునే పండగగా జరుపుకుంటాం. కష్టాల్లో ఉన్న మన జీవితం కొత్త దీపకాంతుల్లో వెలగాలని ఆశించడం సహజం. ఇలా మన పండగల్లో అనుమానాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
13వ తేదీన అమావాస్య ఉదయం 11 గంటల వరకే ఉంటుంది. అందుకే 12నే దీపావళి జరుపుకోవడం ముఖ్యం. నరక చతుర్థి నాడే దీపావళి. నవంబర్ 12నే దీపావళి జరుపుకుంటే మంచిదని పండితుల అభిప్రాయం. మనం కూడా 12నే దీపావళి జరుపుకుని మన దేవతకు పూజలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవడం ప్రధానం.