OTT : ఆ రోజుతో తేలనున్న ఓటీటీల భవిష్యత్..

OTT

OTT

OTT : నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్, అమెజాన్ వంటి టాప్ ఓటీటీ ప్లాట్ ఫాంలతో పాటు టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాలను జూన్ 14న సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) ఆదేశాలు జారీ చేసింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో విస్తరించిన బ్రాడ్ కాస్ట్ సేవల విషయంలో ఉన్న కొత్త నిబంధనలపై చర్చించడం ప్రధాన ఎజెండా.

కేబుల్ టీవీ నిబంధనల మాదిరిగానే ఓటీటీ ప్లాట్ ఫామ్ తో సహా ప్రసార రంగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతేడాది కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఇది సృజనాత్మక స్వేచ్ఛ, వ్యక్తీకరణపై సంభావ్య ప్రభావాలపై ఆందోళనలను రేకెత్తించింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ఓటీటీ ప్లాట్ ఫాం రెగ్యులేటరీ కమిటీ అధికారిక సర్టిఫికేషన్, పర్యవేక్షణ అవసరం.

భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కళాత్మక స్వేచ్ఛను పరిమితం చేస్తుందని ఓటీటీ ప్లాట్ ఫాంలు భయపడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ పరిశీలన కమిటీలు ఓటీటీలో రిలీజ్ కు ముందే పరిశీలించి నిబంధనల మేరకు ఆమోద ముద్ర వేస్తాయి. ఇది థియేటర్ల విడుదలయ్యే సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ ఫారాలు ఇటువంటి స్ట్రీమింగ్ కంటెంట్ పరిశీలన ప్రక్రియలను దాటవేస్తుంది.

ఈ కమిటీలు మితిమీరిన కంటెంట్ ను తొలగిస్తాయని, ఇంత మేర తొలగిస్తే సంబంధిత వెబ్ సిరీస్, మూవీకి అర్థం లేకుండా పోతుందని, దీంతో వ్యూవ్స్ తగ్గి ప్లాట్ ఫాం మూసుకోవాల్సి వస్తుందని నెట్ ఫ్లిక్స్, ఇతరులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటివి జరగకుండా బలమైన స్వీయ నియంత్రణకు తమ కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. స్వీయ ధ్రువీకరణ కోసం కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ (సీఈసీ), కంటెంట్ ఉల్లంఘనలు లేదా కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు బ్రాడ్ కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ)ను వారు ప్రతిపాదించారు.

ఇది ఇలా ఉండగా నెట్ ఫ్లిక్స్ చిత్రం మహారాజ్ చుట్టూ ఉన్న వివాదం, హిందూ సంస్థల నిరసనలు, విడుదలకు ముందు గుజరాత్ హైకోర్టు జారీ చేసిన స్టే ఆర్డర్ ప్రస్తుత నియంత్రణ చర్చలకు మరొక సంక్లిష్టతను జోడిస్తుంది. ముఖ్యంగా ఓటీటీ రంగంలో నియంత్రణ పర్యవేక్షణ, సృజనాత్మక స్వేచ్ఛ పరిరక్షణ మధ్య సమతుల్యతకు సంబంధించి ఎంఐబీ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. 

TAGS