Prabhas – Shahrukh : షారూక్ మార్కెట్ ను ఒడిసి పట్టుకోనున్న ప్రభాస్..
Prabhas – Shahrukh : దశాబ్దకాలంగా యూకే (యునైటెడ్ కింగ్ డమ్) హిందీ సినిమాలకు ప్రధాన విదేశీ మార్కెట్ గా ఉంటూ వస్తోంది. 1970లో ‘దో రాస్తే’ కోసం 100 వేల పౌండ్ల నుంచి 2023లో ‘పఠాన్’ 4 మిలియన్ పౌండ్ల బ్లాక్ బస్టర్ ను తాకే వరకు భారతీయ చిత్రాలకు యూకే మార్కెట్ పరిణామక్రమాన్ని వివరించారు.
ఎన్నో బ్లాక్ బస్టర్లు, మైలురాళ్లతో షారుక్ ఖాన్ కు స్ట్రాంగ్ మార్కెట్ గా యూకే నిలుస్తూ వస్తుంది. పఠాన్ తర్వాత ‘జవాన్’ కూడా యూకేలో 3 మిలియన్ పౌండ్లకు పైగా వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ పై పడింది. కల్కి 2898 ఏడీతో యూకే మార్కెట్ ను సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు రెబల్ స్టార్. యూకేలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా మొదటి 24 గంటల్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోవడం ప్రీ-సేల్ కావడం యూకేలో ప్రభాస్ కు పెరుగుతున్న పవర్ కు నిదర్శనం.
కల్కి 2898 ఏడీ యూకే ప్రీమియర్ సమీపిస్తున్నందున, అంచనాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రారంభ నివేదికల ప్రకారం ఇప్పటికే 9500 అమ్ముడయ్యానని తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో ‘బాహుబలి 2’ 1.82 మిలియన్ పౌండ్లు వసూలు చేయగా, ఆర్ఆర్ఆర్ 1.03 మిలియన్ పౌండ్లతో రెండో స్థానంలో నిలిచింది.
ప్రభాస్ గత చిత్రం ‘సలార్’ మంచి విజయం సాధించినప్పటికీ 0.620 మిలియన్ పౌండ్ల గ్రాస్ సాధించినా రికార్డులను మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. కల్కి 2898 ఏడీతో ప్రభాస్ మిలియన్ పౌండ్ల మార్కును క్రాస్ చేస్తాడా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రాజమౌళి బ్రాండ్ సపోర్ట్ లేకుండా వచ్చిన సినిమా యూకేలో భారీ విజయాన్ని దక్కించుకునే దిశగా పరుగులు పెట్టడం విశేషం.
యూకే బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ స్థానాన్ని సుస్థిరం చేయడానికి కల్కి 2898 ఏడీకి రంగం సిద్ధమైంది. ఇక రిలీజ్ ఒక్కటే మిగిలింది.