Actress Bombed In Bigg Boss : ఆ టాలీవుడ్ హీరో నన్ను అక్కడ తాకాడు.. రూంకు రమ్మన్నాడు.. బిగ్ బాస్ లో బాంబ్ పేల్చిన నటి

Actress Bombed In Bigg Boss
Actress Bombed In Bigg Boss : ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ప్రతీ ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.. నటీమణులు తమకు జరిగిన అవమానాలను, చేదు ఘటనలను డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. దీంతో కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. స్టార్ హీరోయిన్స్ నుండి బుల్లితెర నటీమణుల వరకు ప్రతీ ఒక్కరు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ఏదొక సందర్భంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ నటి టాలీవుడ్ స్టార్ హీరోపై కామెంట్స్ చేసింది.. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆ టాలీవుడ్ హీరో ఎవరు? అంటే.. బిగ్ బాస్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే రచ్చ జరుగుతుంది. తెలుగులో సీజన్ 7 రసవత్తరంగా జరుగుతుంది.
ఇక తమిళ్ లో కూడా ప్రజెంట్ బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో నటి విచిత్ర ఒకరు.. ఈ భామనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసింది.. ఈమె చేసిన కామెంట్స్ తమిళ్ లోనే కాదు తెలుగులో సైతం హాట్ టాపిక్ అయ్యాయి.
తెలుగు స్టార్ హీరోతో సినిమా చేస్తున్న సమయంలో ఈ చేదు అనుభవం ఎదురైంది అంటూ ఈమె చెప్పింది. ఆ సినిమా అడవిలో షూట్ జరుగుతున్న సమయంలో అతడు నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసాడని నేను ఒప్పుకోలేదని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని.. అక్కడ నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు.. షూటింగ్ జరుగుతున్న సమయంలో తాకకూడని చోట తాకాడని చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ అయ్యాయి..