KCR Memes : కేసీఆర్ పై ఈ మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు!
KCR Memes : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ లోక్ సభ ఎన్నికల్లో చేసిన పర్ఫార్మెన్స్ పై మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ మీమ్స్ తో ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో మీమ్ ఒక్కో కథను ప్రజలకు వివరిస్తుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. పదేళ్ల పాలనపై ప్రజలు స్పందించిన తీరు కొందరికి నచ్చితే.. మెజారిటీ ప్రజలకు మాత్రం నచ్చలేదు. అందుకే బీఆర్ఎస్ పాతాళానికి వెళ్లింది. ఇది అసెంబ్లీ కథ అయితే.. ఇక లోక్ సభ కథ మరోలా ఉంది.
‘రెండు పార్టీలు మనమే బయటపడతాం.. కాబోయే ప్రధాన మంత్రిని నేనే.. 11 సీట్లిస్తే దేశాన్నే మారుస్తా’ లాంటి ప్రసంగాలతో కేసీఆర్ హోరెత్తించినా.. ఇవి ఓటర్లకు కాదు సొంత పార్టీ నేతలకే ఎక్కలేదు. కేంద్రంలో ఒక సారి మంత్రి పదవి చేపట్టచ్చు గాక. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గి అట్టడుగుకు వెళ్లిన బీఆర్ఎస్ 11 సీట్లు గెలవడం ఏంటి? కేసీఆర్ ప్రధాని కావడం ఏంటి? అని సొంత కేడర్ లో ప్రశ్నలు తలెత్తాయి.
కానీ, అధినేత ఏదంటే అదే ఫైనల్ కాబట్టి కేడర్ కూడా కేసీఆర్ మాటలకు వంత పాడుతూ వచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర ప్రసంగాలకు అందరూ నవ్వుకున్నారు. మొదట ఒక్క సీటు (మెదక్) వస్తుందని ఆశగా ఎదురు చూశారు. కానీ అది కూడా పోయింది. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి పదేళ్లు గొప్పగా వెలిగిన కేసీఆర్ పై మీమ్స్ హల్ చల్ చేశాయి.
అందులో ఒక మీమ్ ‘ఆర్యభట్ట తర్వాత సున్నాకు అంతటి ప్రాధాన్యత తెచ్చింది మాత్ర ఈ నా బట్టే (కేసీఆర్)’ అని ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2019 ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో రెండంకెల సంఖ్యను చేరుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ‘సున్నా’కు పరిమితమైంది.