Chandrababu : నా కోసం.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: భద్రత అధికారులకు చంద్రబాబు ఆదేశం
Chandrababu : నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని భద్రత అధికారులను టీడీపీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు ఆదేశించారు. భద్రతా కారణాల పేరుతో బారికేడ్ల ఏర్పాటు, పరదాలు కట్టడం, దుకాణాల బంద్, రోడ్ల మూసివేత వంటి వాటికి స్వస్తి పలకాలని సూచించారు. ఎన్డీయే సమావేశం కోసం గురువారం రాత్రి ఢిల్లీ బయల్దేరిన ఆయన, వాహన శ్రేణి వెళ్లే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ను ఎక్కువ సేపు నిలపొద్దని తన ముఖ్య భద్రతాధికారికి తెలిపారు. తక్షణం ఈ ఆదేశాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దీంతో చంద్రబాబు బయల్దేరే ముందే విజయవాడ సీపీ, గుంటూరు ఎస్పీలకు భద్రతా సిబ్బంది సమాచారం అందించారు.