Pakistan : పాకిస్థాన్ కు  చిన్న జట్లపై ఓడిపోవడం అలవాటే..

Pakistan

Pakistan

Pakistan : పాకిస్థాన్ టీం ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కో సారి ఆ టీంను ఆస్ట్రేలియా, ఇండియా కూడా ఓడించనంతా బలంగా కనిపిస్తుంది. అప్పుడే యూఎస్ఏ, జింబాబ్వే లాంటి చిన్న జట్లపై కూడా ఓడిపోయి పరువు పోగోట్టుకుంటుంది.

2022 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో జింబాబ్వే పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోగా.. 2024 వరల్డ్ కప్ మ్యాచ్ లో యూఎస్ఏపై ఓడిపోయి చెత్త ఓటముల రికార్డులను తన పేరున తిరిగి లిఖించుకుంది. బంగ్లాదేశ్, జింబాబ్వే, యూఎస్ఏ, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ లాంటి జట్లపై ఓడిపోయి తన ప్రాభవాన్ని కోల్పోతుంది. నెల రోజుల కిందట ఐర్లాండ్ లో ఆ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది.

వన్డే వరల్డ్ కప్ లో అఫ్గానిస్తాన్ పై కూడా ఓడిపోయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్, రషీద్ ఖాన్ చేసిన డ్యాన్స్ పై పాక్ అభిమానులు గుస్స అయ్యారు. ఇలా ఐసీసీ టోర్నీల్లోన్నే కాకుండా ఇతర మ్యాచుల్లో కూడా ఓడిపోతూ.. ఒకప్పటి పాక్ టీంల కాకుండా గల్లీ టీంలాగా తయారవుతోంది.

పాకిస్థాన్ టీంకు ప్రస్తుతం బాబర్ ఆజం కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. యూఎస్ఏ మ్యాచ్ లో పాక్ చెత్త ఫీల్డింగ్ వారి కొంప ముంచింది. స్లిప్ లో ఫీల్డింగ్ చేసిన ఇఫ్తికార్ ఒక క్యాచ్ పట్టకుండానే వదిలేయగా.. మరో క్యాచ్ ను జారవిడిచాడు. చివర్లో ఉత్కంఠ కొనసాగుతుండగా.. అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ ఇచ్చిన క్యాచ్ ను షాహీన్ ఆఫ్రిది మిస్ చేశాడు. దీంతో ఆరోన్ జోన్స్ చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ను టైగా ముగించాడు.

సూపర్ ఓవర్ లో అయినా పాక్ తీరు మారుతుందనుకుంటే మహమ్మద్ అమిర్ ఎక్స్ ట్రాలు, వైడ్ ల రూపంలోనే 7 పరుగులు ఇచ్చి మొత్తం ఓవరాల్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పాక్ ఆరు పరుగుల తేడాతో క్రికెట్ లో పసికూన యూఎస్ఏపై ఓడిపోయింది. దీంతో పాక్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

TAGS