BRS Party : ఉనికి కోల్పోతున్న ఉద్యమ పార్టీ

BRS Party

BRS Party

BRS Party : తెలంగాణ అంటే తామేనని, పేటెంట్ హక్కులు తమవేనంటూ మొన్నటి దాకా డంకా బజాయించిన కేసీఆర్ కు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కొంత పరువు నిలబెట్టుకున్నా, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం కోలుకోలేని దెబ్బకొట్టాయి.  

అంతా తానేనని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి టీఆర్ఎస్  2019 పార్లమెంట్ ఎన్నికల్లో  కారు.. సారు.. 16 అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొమ్మిది సీట్లకే పరిమితమైంది. దేశ రాజకీయాల్లో తాము కీలకం కాబోతున్నామంటూ టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో ముందుకు సాగుతామని దేశమంతా తిరిగారు. ఆంధ్రపదేశ్ తో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించే ప్రయత్నం చేశారు.  మూడో సారి కూడా తామే అధికారంంలోకి వస్తామని  చెప్పుకొచ్చారు కేసీఆర్. కానీ 2023 అసెంబ్లీ ఫలితాలు  మాత్రం గులాబీ బాస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అదే సమయంలో అనారోగ్య సమస్యలు, వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ పూర్తిగా పట్టు సాధించలేకపోయింది. జనంలో వ్యతిరేకత కూడా తగ్గలేదు. ఫలితంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ పార్టీ దెబ్బతిన్నది. 2004 ఎన్నికల నుంచి కేసీఆర్ పార్టీకి పార్లమెంట్ సభ్యలు ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఒక్కరూ గెలవలేకపోవడం శోచనీయం.  

పతనానికి కారణమేంటి?
టీఆర్ఎస్ స్వరాష్ట్ర సాధన కోసం కోసం పుట్టిన పార్టీ. 2014లో విజయం సాధించిన టీఆర్ఎస్ తర్వాత అధికారం చేపట్టింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఉద్యమకారులను పక్కన పెట్టి కాదని.. సమైక్యాంధ్ర కోసం పోరాడిన వారిని పార్టీలోకి తీసుకుననారు. మంత్రి పదవులు సైతం ఇచ్చారు. సగటు ఉద్యమకారులు దీనిని జీర్ణించుకోలేకపోయారు. కానీ తమ ఆగ్రహాన్ని బయటికి చూపించలేకపోయారు.  రెండోసారి మరింత మెజార్టీతో అధికారంలోకి రావడంతో పార్టీలో, ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం, కుల పెత్తనం ఎక్కువైపోయింది.  కేసీఆర్ ధోరణి  పార్టీకి నష్టం కలిగించాయి. ఎప్పటి నుంచో రగిలిపోతున్న ఉద్యమకారులు, పార్టీ కోసం కష్టపడిన వారు 2023 ఎన్నికల్లో మిన్నకుండి పోవడంతో గులాబీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పలేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో పరువు కాపాడుకోగలిగినా అధికారానికి దూరమైంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోవడం ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతే ఇందుకు నిదర్శనం  

TAGS