Bigg Boss 7 Telugu : ఈ వారం హౌస్ నుండి అవుట్ అయ్యేది ఎవరో తెలుసా.. గుడ్ బై చెప్పేస్తుందా.. 

Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి బిగ్ బాస్ అడుగు పెట్టారు.. మరి ఈ వారం మొత్తం హౌస్ లో ఫ్యామిలీ వీక్ ను బిగ్ బాస్ సెలెబ్రేట్ చేసిన విషయం తెలిసిందే.. ఒక్కో ఇంటి సభ్యుడు నుండి ఒక్కొక్కరు రాగా కంటెస్టెంట్స్ మొత్తం ఎమోషనల్ అయిపోయారు.

ఇదిలా ఉండగా ఈ వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. దీంతో 10వ వారంలో ఓటింగ్ ఎలా ఉంది? ఎలిమినేషన్ ఎలా జరగబోతుంది? డేంజర్ జోన్ లో ఎవరున్నారు ? అనే విషయాలు తెలుసుకుందాం.. ఈసారి సీజన్ 7లో మునుపెన్నడూ చూడని విధంగా మొత్తం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ నడుస్తున్న విషయం విదితమే.. ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వడంతో గతం కంటే ఇంట్రెస్ట్ గా సాగుతుంది..

ఇప్పుడు హౌస్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, భోలే, శివాజీ ఉన్నారు. వీరిలో ఎవరిని బయటకు పంపిస్తారు అనే విషయం ఆడియెన్స్ డిసైడ్ చేయనున్నారు.. ఈ వారం డేంజర్ జోన్ లో రతికా రోజ్, భోలే ఉన్నట్టు టాక్.. వీరిలో ఎలా చూసుకున్న రతికా మళ్ళీ హౌస్ ను వీడనుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..

రీ ఎంట్రీ తర్వాత అయినా ఆట ఆడుతుందేమో అని అనుకుంటే మళ్ళీ పాత ఆటతీరునే కనబరచడంతో ఆడియెన్స్ ఈమెను బయటకు పంపించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.. ఒక పక్క భోలే కూడా తన పాటలతో కంటెంట్ ఇస్తూ తన గేమ్ తీరును మెరుగు పరుచుకున్నాడు..

అయితే రెండవ ఛాన్స్ వచ్చిన కూడా రతికా మాత్రం తన ఆట తీరును ఏమాత్రం మార్చుకోలేక పోయింది అనే చెప్పాలి. దీంతో ఈమె అవుట్ అనే చెప్పాలి. ఈ వారం నుండి కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ జరగనుంది.. మిగిలిన ఐదు వారాల్లో ఎవరు బయటకు వస్తారు ఎవరు టాప్ 5 లో ఉంటారో చూడాలి. మరి సీజన్ 7 విజేత ఎవరు అవుతారో ఆడియెన్స్ చేతుల్లో ఉంది..

TAGS