Sharad Pawar : మహారాష్ట్రలో శరద్ పవార్ దే పైచేయి
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ తన ప్రాధాన్యాన్ని చాటుకున్నారు. పార్టీ చీలికతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, తనదైన వ్యూహాలతో మెరుగైన ఫలితాలు సాధించారు. చీలికతో ఎన్సీపీ రాజకీయంగా బలహీనపడినప్పటికీ కాకలు తిరిగిన నేత శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి కృషి చేశారు. ఆయన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో 8 స్థానాల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తన పట్టును మహారాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకున్నారు.
83 ఏళ్ల పవార్ అటు జాతీయస్థాయిలో ‘ఇండియా’, ఇటు రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ కూటమిలో కీలక పాత్రధారిగా ఉన్నవిషయం తెలిసిందే. రాజకీయాల్లో 50 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ మాజీ కేంద్ర మంత్రి తన పార్టీని గట్టెక్కించడంలో ఒంటరి పోరాటం చేశారు. కొత్త గుర్తుతో పోటీ చేయాల్సి వచ్చినా తనదైన వ్యూహాలతో ఆచితూచి అభ్యర్ధులను ఎంపిక చేశారు. సొంత పార్టీ అభ్యర్థుేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలుపు కోసం శ్రమించారు.