BJP Odisha : ఒడిశాలో బీజేపీ ఆధిక్యం
BJP Odisha : లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒడిశాలో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి ప్రకారం.. ఆధిక్యంలో బీజేపీ మెజార్టీ మార్కును దాటేసింది. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే కావలసిన మ్యాజిక్ ఫిటర్ 74. కానీ బీజేపీ 78 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోపక్క బీజేడీ అభ్యర్థులు 54 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. స్వతంత్రులు రెండు స్థానాల్లో ముందున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. చివరకు ముఖ్యమంత్రి పట్నాయక్ కూడా ఒక స్థానంలో వెనుకంజలో ఉండటం గమనార్హం. కాంటాబంజి అసెంబ్లీ స్థానంలో ఆయనపై బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే హింజిలి అసెంబ్లీ స్థానంలో మాత్రం సీఎం ముందంజలో ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 21 లోక్ సభ స్థానాలకు గానూ.. 18 చోట్ల కమలం పార్టీ ముందు వరుసలో ఉంది. రెండు చోట్ల మాత్రమే బీజేడీ అభ్యర్థులు ముందున్నారు. ఒకచోట కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఇప్పటి వరకు అయిదు సార్లు (2000-2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించారు.