America : అమెరికాలో తెలుగు విద్యార్థుల కిడ్నాప్.. అసలేం జరుగుతోంది.. విద్యార్థులకు భద్రత కరువు 

America

Hyderabad Student Nitheesha Kandula Kidnap-America

America : తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వెళుతున్న విద్యార్థులు అదృశ్యమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నత విద్య అభ్యసించడానికి వెళుతున్న స్టూడెంట్లు కిడ్నాప్, యాక్సిడెంట్లతో చాలామంది చనిపోతున్నారు. 

ఈ మధ్య అమెరికా చికాగోలో 25 ఏండ్ల తెలంగాణ స్టూడెంట్ రూపేశ్ చంద్ర అనే విద్యార్థి కిడ్నాప్ కు గురయ్యాడు. చంద్ర విస్కాన్సిన్ లోని కాంకోర్డియా యూనివర్సీటీలో చదువుతున్నాడు. ఈ ఘటనకు ముందు 25 ఏండ్ల మహ్మద్ అబ్దుల్ అరాపత్ కూడా కిడ్నాప్ అయి ఆ తర్వాత శవమయ్యాడు. వీరితో పాటు రోజూ రోడ్డు ప్రమాదాల్లో స్టూడెంట్లు మరణిస్తున్నారు. గత సంవత్సరం కూడా 24 ఏండ్ల ప్రతీక్షా కున్వర్ అమెరికాలోని కాన్సాస్ లో ని చెనీలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మరణించింది. ఈమె మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లింది. 

అగ్రరాజ్యం అమెరికాలో ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోవడంతో ఇక్కడి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన యువతి ఒకరు అదృశ్యమయ్యారు. 23 ఏండ్ల నితీషా కందుల అమెరికాలో కిడ్నాప్ కు గురైంది. ఈమె కాల్ స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుకుంటోంది.  ఆమె మే 28, 2024 న కనిపించకుండా పోయినట్లు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

దీంతో ఎన్నో ఆశలు, ఆశయాలతో అమెరికాకు వెళ్లి పెద్ద చదువులు చదివి..  గొప్పగా జీవించాలని ఆశిస్తోన్న తల్లిదండ్రులకు మనో వేదనే మిగులుతోంది. గతంలో అమెరికాలో భద్రత ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా  అమెరికాలో విచ్చలవిడిగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చాలా సార్లు కాల్పుల్లో అనేక మంది అమాయకులు మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కాల్పులు జరిగినపుడు ఆయుధాల చట్టం మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికాలోని ప్రజా ప్రతినిధులు మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదు.

TAGS