Namibia Vs Oman : నమీబీయా, ఓమన్ మధ్య సూపర్ ఓవర్ మ్యచ్
Namibia Vs Oman : గ్రూపు బిలో నమీబియా, ఓమన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ టైగా మారగా.. సూపర్ ఓవర్ కు దారి తీసింది. స్వల్ప టార్గెట్ ను ఛేదించలేకపోయిన నమీబియా సూపర్ ఓవర్ లో 21 పరుగులు చేసి ఘన విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఓమన్ 109 పరుగులకే ఆలౌటైంది. ఓమన్ ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు.
మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఖలీద్ కాళీ (34), జాకీర్ మసూద్ (22) ఇద్దరు పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయగా.. కోలుకున్నట్లు కనిపించిన ఓమన్ వీరిద్దరూ అవుట్ కాగానే మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 109 పరుగులకే ఆలౌట్ అయింది.
పిచ్ కాస్త స్లో గా ఉండటం, బౌలింగ్ కు అనుకూలించడంతో ఓమన్ బౌలర్లు కూడా నిప్పులు చెరిగే బంతుల్లో నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. నమీబియా బ్యాటర్లలో జేమ్స్ ఫ్రాంకిన్ 45 పరుగులు చేయగా.. నికోలస్ డేవిన్ 22 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు సరిగా ఆడకపోవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.
ఓమన్ పేసర్ బిలాల్ చివరి ఓవర్ లో అయిదు పరుగులను కాపాడి మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు దారి తీసేలా చేశాడు. కేవలం అయిదు పరుగులు చేయకుండా నమీబియా బ్యాటర్లను అడ్డుకున్నాడు. చివరి బాల్ కు కీపర్ బాల్ మిస్ చేయకుండా ఉండే ఓమన్ మ్యాచ్ గెలిచేదే. కానీ ఓమన్ వికెట్ కీపర్ ఈజీ బాల్ మిస్ చేసి రనౌట్ కూడా కొట్టలేకపోవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది. సూపర్ ఓవర్ లో నమీబియా సీనియర్ ఆల్ రౌండర్ డేవిడ్ వీజా ఫస్ట్ రెండు బంతుల్లో సిక్సు, ఫోర్ కొట్టి 10 పరుగులు చేయగా.. చివరి రెండు బంతులు ఏరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. నమీబియా ఆరుబంతుల్లో నే 21 పరుగులు చేసింది. 22 పరుగులు టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఓమన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నమీబియా మొదటి విజయం నమోదు చేసుకుంది.