Lift Viral Video : లిఫ్ట్ లో ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం తప్పదు..

Lift Viral Video

Lift Viral Video

Lift Viral Video : గతంలో ఏదో ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటి వాటికే పరిమితమైన లిఫ్ట్ లు ఇప్పుడు ఇళ్లల్లోకి వచ్చేశాయి. రెండు కంటే ఎక్కువ అంతస్తులు కట్టుకుంటున్న ప్రతీ ఒక్కరూ లిఫ్ట్ పెట్టించుకోవడం తప్పనిసరిగా భావిస్తున్నారు. లిఫ్ట్ పెట్టుకోవడమే కాదు.. దాని వల్ల జరిగే ప్రమాదాల గురించి కూడా తెలుసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కేవలం ప్రమాదాలు జరగడమే కాదు ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే లిఫ్ట్ లో, లిఫ్ట్ వద్ద జాగ్రత్తగా మెదలాలి.

లిఫ్ట్ కారణంగా చాలా మంది మరణించారన్న వార్తలను మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. వినియోగించడం, మెయింటెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవి ఇప్పుడు పాయింట్ల పరంగా తెలుుకుందాం.

* లిఫ్ట్ లోకి వెళ్లిన తర్వాత ఒకే సారి రెండు, మూడు ఫోర్ల బటన్లు ప్రెస్ చేయవద్దు. ఒక్కో ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కిన వారు ఒక్క బటన్ ప్రెస్ చేయవచ్చు. కానీ ఒకే ఫ్లోర్ లో ఎక్కి రెండు మూడు బటన్లను ప్రెస్ చేయవద్దు.
* ఏవైనా గూడ్స్ లాంటివి లిఫ్ట్ లో తీసుకెళ్తుంటే జాగ్రత్తగా ఉండాలి. ముందు గూడ్స్ ను లిఫ్ట్ లోపలికి పెట్టి తర్వాత మనం ఎక్కితేనే బాగుంటుంది.
* ఏదైనా ప్రమాదం జరిగి లిఫ్ట్ పడిపోతే వెంటనే కింద వెళ్లకిలా పడుకోవాలి. లేదంటే భారీ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. వెన్నెముఖ కూడా విరిగిపోవచ్చు.
* లిఫ్ట్ డోర్లను చేతులతో తెరవడం చేయవద్దు. ఒక్కొక్కసారి అందులో చేతులు ఇరుక్కొని లిఫ్ట్ మూవ్ అయితే చేతులు మొత్తం కోల్పోతారు.
* పెట్ ను లిఫ్ట్ లో తీసుకెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది అటూ ఇటూ పరుగెత్తడం వల్ల దాని మెడకు కట్టిన బెల్ట్ లిఫ్ట్ లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. 

TAGS