Missing : లాస్ ఏంజిల్స్ లో తెలుగు విద్యార్థిని అదృశ్యం

Missing

Missing

Missing : భారత విద్యార్థుల కలల సౌదం అమెరికాలో రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ నేపథ్యలో అమెరికా వెళ్లడమంటేనే స్టూడెంట్స్ ఆందోళన చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో భారత స్టూడెంట్లు మిస్సవడం, యాక్సిడెంట్లలో మరణించడం తరుచూ వినిపిస్తోంది. నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో భారతీయ స్టూడెంట్లు అదృశ్యం కావడం, లేదంటే యాక్సిడెంట్లలో మృతి చెందడం జరిగింది. దీంతో ఇండియాలోని వారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర కలత చెందుతున్నారు.

ఇప్పుడు అమెరికా చదువంటేనే తల్లిదండ్రులు ఒకింత ఆలోచించేంతగా మారింది. అయితే, యాక్సిండెంట్లు జరుగుతున్నాయంటే అది ప్రమాదంగా భావించ వచ్చు కానీ అదృశ్యం కవడం. అదే భారతీయ స్టూడెంట్లే ఎక్కువగా అవడంపై కొంత ఆందోళన నెలకొంది. ఇలాంటి ఘటనే లాస్ ఏంజిల్స్ లో జరిగింది. మరో భారతీయ స్టూడెంట్ మిస్సయ్యింది.

లాస్ ఏంజిల్స్ లో భారతీయ విద్యార్థిని నితీషా కందుల అదృశ్యమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సీఎస్ యూఎస్‌బీ (కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినో)లో విద్యార్థిని అని వాట్సాప్ ఫార్వర్డ్ సూచిస్తున్నాయి. గత శుక్రవారం (మే 31) రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఆమె కాంటాక్ట్ లో లేరని, ఆమెను సంప్రదించేందుకు పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆ సందేశంలో పేర్కొన్నారు.

హైదరాబాద్ కు చెందిన నితీషా సోదరుడు సహాయం కోరుతూ ఆమె సమాచారం తెలిస్తే +91 80749 62618కు మెసేజ్ పంపాలని కోరుతున్నాడు. ఆమె ఆచూకీ దొరకాలని ఆమె క్షేమంగా ఉండాలని తాము కోరుతున్నాం అని అక్కడి భారతీయ విద్యార్థులు చెప్తున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా నితీషా ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తోంది.

TAGS