Viral News : కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం..!

CBN and Revanth Reddy

CBN and Revanth Reddy

Viral News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిప్రక్ష బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని చేపట్టింది. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి భేటి అయ్యారని ఒక ప్రచారాన్ని చేపట్టింది. తెలంగాణను ఏపీలో విలీనం చేసే ప్రతిపాదనపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగిందని గులాబీ పార్టీ.. ఆ పార్టీకి సంబంధించిన పత్రిక మీడియాలో జోరుగా ప్రచారం చేసింది.

ఈ ప్రచారం జోరందుకోవడంతో కాంగ్రెస్ లో రేవంత్ = చంద్రబాబు భేటిపై కలకలం చెలరేగింది. హస్తం పార్టీ గెలుపునకు చంద్రబాబు సూచనలు చేశారని.. అవసరమైతే డబ్బులు కూడా పంపిస్తానని హామీ ఇచ్చారని ప్రచారం సాగింది.

fake News

fake News on Viral

అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. రేవంత్ కు, చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదని..ఇద్దరి దారులు వేరని .. ఇద్దరి పార్టీలు వేరని..పాత బంధాన్ని పట్టుకొని బీఆర్ఎస్ ఇలా రాజకీయం చేయడం తగదంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది..

దీంతో చంద్రబాబు, రేవంత్ ను బూచీగా చూపి బీఆర్ఎస్ ఏదో పెద్ద స్కెచ్ వేశారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.

TAGS