Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లి కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్
Anant Ambani Wedding Card : ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నిశ్చయమైంది. అనంత్ అంబానీ పెళ్లి రాధిక మార్చంట్ తో జూలై 12న ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంభైలో వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. ఆన్ సీ ఈవెంట్ మే 29న ప్రారంభమై జూన్ 1 వరకు జరుగుతుంది. అంటే ఫ్రెంచ్ క్రూయిజ్ షిప్ లో అతిథులకు పార్టీ ఇస్తున్నారు. పార్టీకి సినీ తారలు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
జూలై 12న శుభ్ వివాహ, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్, అకా మ్యారేజ్ రిసెప్షన్ తో అంబానీ ఇంట వేడుకలు ముగుస్తాయి. అయితే, వీరి పెళ్లి ముంభైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనంత్, రాధికల పెళ్లి కార్డు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.