Prabhas Kalki : అందుకే బడ్జెట్ పెరుగుతూ వెళ్లింది.. ‘కల్కి’ గురించి ప్రభాస్ లీక్..

Prabhas Kalki

Prabhas Kalki

Prabhas Kalki : నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ కాంబోలో వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ సినిమా జూన్‌ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దాదాపు నెల సమయం ఉంది కాబట్టి చిత్ర బృందం ప్రమోషన్ వర్క్ స్ట్రాట్ చేసింది. దీనిలో భాగంగా ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్ మూవీ. అంతర్జాతీయ మూవీ లవర్స్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాం. అందుకే ఎక్కువ బడ్జెట్‌ అయింది. నేషనల్ వైజ్ గా స్టార్ యాక్టర్స్ ను తీసుకున్నాం. నన్ను పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. ఫ్యాన్స్ నన్ను అలా పిలిచేందుకే ఎక్కువ ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపులో సంతోషం ఉంది.’ అని ప్రభాస్‌ అన్నారు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘కల్కి’ చూశాక మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. నేను ‘అవతార్‌’ చూశాక అలాంటి అనుభూతినే పొందా. ఒక కొత్త లోకం చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ‘కల్కి’ చూస్తున్నంతసేపు థియేటర్‌లో ప్రేక్షకులకు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లను కూడా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కోసం పెట్టాం. వీటిలో ఎలాంటి మార్పులు ఉండవు.’ అని చెప్పారు. ఇక, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరిన్ని విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో వాడిన బుజ్జీ అనే వాహనాన్ని రీసెంట్ గా ఆవిష్కరించారు. ఆ వాహనాన్ని పలు నగరాల్లో నడుపుతూ మూవీ ప్రమోషన్స్‌ చేస్తున్నారు. చెన్నై వీధుల్లో ‘బుజ్జి’ చేసిన సందడి విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  కోరారు. ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆయనను ఆహ్వానించారు. అలాగే బుజ్జి, భైరవకు సంబంధించిన స్పెషల్‌ వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ 31 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కల్కిలో ప్రభాస్  సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ గా, అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు.

TAGS