Chandrababu-Varma : చంద్రబాబుతో వర్మ భేటీ..పవన్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారంటూ..

Chandrababu-Varma

Chandrababu-Varma

Chandrababu-Varma : ఏపీలో ఎన్నికలు ముగిసి అందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపిన నియోజకవర్గం పిఠాపురం. అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఇందుకు కారణం. పవన్ ను ఓడించడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పవన్ ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని ప్రతీ మండలానికో వైసీపీ మంత్రిని, కీలక వ్యక్తిని ఇన్ చార్జిగా పెట్టారు. డబ్బులు కూడా యథేచ్ఛగా పంచారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కెల్లా అత్యంత ఉత్కంఠభరితంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో తన సీటును పవన్ కోసం త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ..పవన్ గెలపు కోసం అహర్నిషలు కష్టపడ్డారు. తాజాగా చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాగానే ఆయన్ను వర్మ హైదరాబాద్ లో కలిశారు. పిఠాపురంలో ఏం జరిగిందో ఆయనకు వివరించారు.

చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో కలిసిన వర్మ..పిఠాపురం ఎన్నికల సరళిని వివరించారు. స్థానికంగా పవన్ కు తాము అందించిన మద్దతు గురించి తెలిపారు. అలాగే పవన్ కు అనుకూలంగా పిఠాపురంలో జరిగిన పోలింగ్, ఆయన మెజార్టీపై కూడా వివరణ ఇచ్చారు. పవన్ గెలపునకు దోహదం చేయబోతున్న అంశాలను కూడా చంద్రబాబుకు వర్మ వివరించారు. అలాగే టీడీపీ శ్రేణులు పవన్ కు మద్దతుగా ఓట్ల బదిలీ కోసం ఎలా పనిచేశాయన్నదీ చెప్పుకొచ్చారు.

చంద్రబాబుతో భేటీ అనంతరం వర్మ ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని చంద్రబాబుకు వివరించినట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ట్వీట్ కు స్పందనగా జనసేన క్యాడర్ కూడా తాము రాష్ట్రంలో అదే విధంగా టీడీపీ విజయం కోసం పనిచేసినట్లు ట్వీట్లు పెడుతున్నారు. మరికొందరు వర్మ త్యాగాన్ని అభినందిస్తున్నారు. మరో వైపు పిఠాపురంలో పవన్ 50వేల మెజార్టీకి పైగా సాధించబోతున్నారని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు పవన్ గెలువబోతున్నారంటూ ‘‘పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా’’ అంటూ బైక్ లు, కార్లకు స్టిక్కర్లు కూడా వేసుకుంటున్నారు.

TAGS