Chandrababu : టీడీపీ అధినేత అంచనా.. ఈ సారి గెలిచే సీట్లు ఇవే
Chandrababu : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. వైసీపీ – తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఈ సారి జరిగిన ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. వచే నెల 4వ తారీఖున ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నికల ఫలితాల కోసం అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకటో తేదీన జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. వాటినిబట్టి ఏ ప్రభుత్వం వస్తుందని ఒక అంచనాకు రావొచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తన విదేశీ పర్యటనకు ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే విషయాన్ని అంచనా వేశారు.
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తే ఈ సారి ఎన్నికల్లో అధికార వైసీపీకి కనీసంలో కనీసం 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అంచనా వేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ మాటకు కట్టుబడి సహకారం అందించారని, గతంలో ఒక్క సీటుకే పరిమితమైనప్పటికీ మెజారిటీ సీట్లలో జనసేన గెలవబోతోందని పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం. వైసీపీ ఈ మారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా ఎదిరించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అరాచకాలను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. అందుకు మాచర్ల, తాడిపత్రి సంఘటనలే ఉదాహరణలుగా వివరించారు.
జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈ సారి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరిగిందని అంటున్నారు. ప్రజలంతా వైసీపీ దారుణాలను భరించలేక కూటమికి జై కొట్టారని అంటున్నారు. వారు అలా వ్యవహరించడానికి కూడా కారణం ఉందన్నారు. ఫలానా పార్టీకి ఓటు వేశామని చెబితే ప్రత్యర్థి పార్టీ నుంచి కేసుల గొడవలు, ఇతరత్రా అల్లర్లు జరగే ఛాన్స్ ఉందని భావించి వీరంతా ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బయటకు చెప్పడం లేదని పలువురు చెబుతున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గానూ.. కూటమి 120 సీట్లకు పైగా గెలవడం ఖాయమంటున్నారు.