Exit Polls : ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ అంచనాలే నిజం అవుతాయా..?

Exit Polls

Exit Polls

Exit Polls : ఓట్ల లెక్కింపునకు రోజులు దగ్గర పడినా కొద్దీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మూడు రోజుల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత మరో మూడు రోజుల్లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ ఆంక్షలు విధించడంకొన్ని రోజులు ఉపశమనం కలిగిస్తుంది. మెజార్టీ లెక్కలు కట్టుకుంటూ ఆతృతగా ఎదురుచూస్తున్న కూటమి నేతల సహనాన్ని పరీక్షిస్తున్నట్ల అవుతోంది.

ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయో అందరికీ తెలిసినప్పటికీ కామన్ గానే ఎగ్జయిట్ కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ తో విజయంపై స్పష్టత వస్తుందని కూటమి నేతలు ఎదురుచూస్తుంటే, కనీసం ఎగ్జిట్ పోల్స్ అయినా తమకు అనుకూలంగా రాకపోతాయా.. అని వైసీపీ అనుకుంటోంది. అయితే టీడీపీ – జనసేన – బీజేపీలు పొత్తులు, సీట్ల సర్దుబాట్లతో కలిసికట్టుగా ప్రచారం చేసినప్పుడే సగం విజయం సాధించాయని ఏపీలో టాక్ వినిపిస్తుంది.

ఈసారి పవన్‌ కళ్యాణ్‌ పరిణతితో వ్యవహరిస్తూ, కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడంలో సఫలీకృతం అయ్యారు. ఇది జనసేన గెలుపునకే కాక ఇతర ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీలకు జనసేన ఓట్లు బదిలీకి తోడ్పడుతుంది. వర్మ వంటి పలువురు టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ కోసం ప్రాణాలను పణంగా పెట్టే కార్యకర్తలు కూడా కూటమిలోని జనసేన గెలుపు కోసం ఎంతగానో శ్రమించారు. కనుక జనసేనకు కూడా టీడీపీ ఓట్లు బదిలీ అవడం ఖాయమే.

కానీ, టీడీపీ, జనసేన ఓట్లు ఏ మేరకు బీజేపీకి బదిలీ అయ్యాయి అనేది ఫలితాలు వెలువడే వరకు తెలియదు. ఈసారి టీడీపీ, జనసేన ప్రభంజనం ఉన్నందున బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. టీడీపీ కూటమి గెలుపును, వైసీపీ ఓటమిని సజ్జల రామకృష్ణా రెడ్డి, పేర్ని నాని వంటి వైసీపీ నేతలే తమ నోటి దురుసుతో తీసుకువచ్చారనే టాక్ ఉంది. కనుక జూన్ 1, జూన్ 4 తేదీల్లో వారి అంచనాలు మరోసారి ధృవీకరించడం లాంఛనమే అని భావించవచ్చు.

TAGS