Dhanush : ధనుష్ రెండో పెళ్లి.. వధువు ఎక్కడ ఉందంటే?

Dhanush

Dhanush

Dhanush : సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకోబోతున్న తమిళంలో స్టార్ హీరో ధనుష్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ సర్కిల్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడో తెలుసుకుందాం?

కోలీవుడ్‌ స్టార్ ధనుష్ 2004లో రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ధనుష్ సోదరుడైన సెల్వరాఘవన్ కోలివుడ్ డైరెక్టర్, దీంతో ధనుష్ తో వివాహం జరిగిన తర్వాత ఐశ్వర్య అతని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. 2012లో ‘త్రీ 3’ సినిమా తీసి దర్శకత్వంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలోనే ‘వై దిస్ కొలవెరీ’ సాంగ్ వరల్డ్ వైడ్ గా విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. కానీ, పాటలు హిట్ అయినంత సినిమా హిట్ కాలేదు. దీంతో ఫస్ట్ మూవీ వరస్ట్ గా నిలిచింది. తర్వాతి చిత్రం గౌతమ్ కార్తీక్ ను హీరోగా పెట్టి ‘వై రాజా వాయ్’ తెరకెక్కించింది. ఈ సినిమాలో ధనుష్ కేవలం క్లైమాక్స్‌లో కోకి కుమార్‌గా కనిపించాడు. కానీ, ఇది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

దీంతో ఐశ్వర్య దర్శకత్వానికి విరామం ప్రకటించి పర్సనల్ లైఫ్ పై, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను ఇన్‌ స్టాలో పోస్ట్ చేస్తుంది. మరో వైపు ధనుష్ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా విడాకుల కలకలం రేగింది.

తాము విడాకులు తీసుకోబోతున్నట్లు 2022లో వీరు ప్రకటించారు. వీరి నిర్ణయం ఇరువైపులా తల్లిదండ్రులతో పాటు చాలా మందికి షాక్ కలిగించింది. పెద్దల చర్చల దృష్ట్యా రెండేళ్లు వాయిదా వేశారు. ఆ తర్వాత కోర్టులో డైవర్స్ అప్పీలు వేసుకున్నారు. ఇక వీరు కలిసి ఉండరనే అవకాశం లేదనేది కోర్టు మెట్లు ఎక్కడంతో ఖాయంగా అనిపించింది.

తన కొడుకు మనసు మార్చాలని ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. సినిమాల అమ్మాయిలు వద్దని డిసైడ్ అయిన ఆయన బంధువుల్లో అమ్మాయిలని చూస్తున్నాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

TAGS