T20 series with Australia : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ : ఇండియాకు కొత్త కెప్టెన్ ఎవరంటే?
T20 series with Australia : భారత్ వరల్డ్ కప్ ఫైనల్ లో పరాజయం తరువాత ఆస్ట్రేలియాతో మరోమారు పోరాటానికి సై అంటోంది. నవంబర్ 23 నుంచి టీ 20 ఐదు మ్యాచ్ ల సిరీస్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. గాయం కారణంగా హార్థిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా టోర్నీ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ కు బదులు తీర్చుకునేందుకు కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాను కట్టడి చేసే వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.
ఈనేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ లో ఓటమికి భారత్ బదులు తీర్చుకుంటుందా? ఆసీస్ ను కట్టడి చేస్తుందా? లేక వారి ఆధిపత్యానికి తలవంచుతుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో వస్తున్నాయి. నవంబర్ 23న విశాఖపట్నంలో మొదటి మ్యాచ్, 26న తిరువనంతపురంలో రెండో మ్యాచ్, 28న గౌహతిలో మూడో మ్యాచ్, డిసెంబర్ 1న జైపూర్ లో నాలుగో మ్యాచ్, 3న బెంగుళూరులో ఐదో మ్యాచ్ జరగనుంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణో్, అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్, ముకేష్ కుమార్ లను సెలెక్ట్ చేసింది. వీరి ఆధ్వర్యంలోనే జట్టు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.